Vidya Balan: బాలీవుడ్ అందాల నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి తన అందం అభినయంతో కుర్ర హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. విద్యాబాలన్ తన అందంతో పాటు వైవిధ్యమైన పాత్రలలో నటించి మంచి నటిగా పేరు పొందింది. అందరి హీరోయిన్ల లాగా విద్యాబాలన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కొన్ని సందర్భాలలో బాడీ షేవింగ్ గురించి అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది. కొన్ని తనదైన శైలిలో గట్టిగా సమాధానాలు చెప్పి నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు ఇంతకంటే దారుణమైన అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.
తాజాగా విద్యా బాలన్ సినిమాలలో మాత్రమే కాకుండా ప్రకటనలలో కూడా నటిస్తూ నిత్యం బిజీగా ఉంటుంది. విద్యాబాలన్ ఇటీవల జల్సా సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ జల్సా సినిమా ఓటిటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న విద్యాబాలన్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే ఎంతోమంది ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉంటారు.కొంతమందికి వారు పడిన కష్టానికి ఫలితం లభించగా మరికొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కూడా దొరకక తమ కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి.
జల్సా సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న విద్యాబాలన్ మాట్లాడుతూ అందరికీ అలాగే సినిమా ఆఫర్ల కోసం తను ఎంతో కష్టపదింది. విద్యాబాలన్ కెరీర్ ప్రారంభంలో సినిమా ఆఫర్లు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయేవి. చాలా మంది నిర్మాతలు సినిమా ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత నోటీసు కూడా ఇవ్వకుండానే సినిమాల నుండి తప్పించేవారు. విద్యాబాలన్ అలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఒక నిర్మాత దారుణంగా అవమానించారు. ఆ నిర్మాత అన్న మాటలకు మనస్తాపం చెంది ఆరునెలల పాటు నా ముఖాన్ని అందంలో కూడా చూసుకోలేకపోయాను. ఆ నిర్మాత మాటలు అంతగా నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మూడేళ్లు ఎన్నోకష్టాలు పడి, ఎన్నో ప్రయత్నాలు చేసి .. ఎన్నో అవమానాలు భరించి తట్టుకొని నిలబడి ఇప్పుడు ఈ స్థానానికి వచ్చాను” అని చెప్పుకొచ్చింది.