Guppedantha Manasu March 23th Today Episode : మా టీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ మంచి ప్రేక్షకాదరణ పొంది సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతోంది. చిన్నప్పుడే కొడుకుకు దూరమైన తల్లి కొడుకు ప్రేమ కోసం ఆరాట పడుతూ ఉంటుంది. ఈ సీరియల్ లో వసుంధర,రిషి మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు కూడా సీరియల్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు జరగబోయే ఎపిసోడ్ గురించి ముందే మనం తెలుసుకుందాం.

సీరియల్ లో ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో రిషిని వదిలి జగతి దగ్గరకు వెళ్లిపోయిన మహేంద్ర కోసం రిషి బాధపడుతూ ఉంటాడు. మహేంద్ర విషయంలో రిషి వసుధారను ఒక సలహా అడగాలి అనుకుంటాడు. ఒక స్టూడెంట్ లా కాకుండా ఒక ఫ్రెండ్ గా నాకు ఒక సలహా ఇవ్వు అని రిషి వసుధారను అడుగుతాడు. రిషి అలా ఫ్రెండ్ అనగానే వసుధార షాక్ అవుతుంది. చిన్నప్పుడే తల్లి వదిలేసి పోయింది ఇప్పుడు నాన్న కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అందులో నా తప్పేముంది అని అంటాడు.
రిషి అడిగిన ప్రశ్నకు ఫస్ట్ వసుకు ఏం చెప్పాలో అర్థం కాక మనసులోనే సతమతమవుతూ ఉంటుంది. చిన్నప్పుడు అమ్మలేదని ఏడ్చాను కానీ ఇప్పుడు నాన్న లేడని నేను ఏడ్చేలేను కదా అని రిషి అంటాడు. ఇక్కడ జగతి ఇంట్లో మహేంద్రని భోజనానికి పిలిచి అన్నం వడ్డిస్తుంది జగతి. కానీ మహేంద్రకు రిషి గుర్తొచ్చి రిషి అన్నం తిన్నాడో లేదో అని మనసులో అనుకుంటూ..అన్నం తినకుండా రిషి గుర్తొస్తున్నాడు అని జగతిలో అంటాడు. మనందరం త్వరలోనే కలుస్తామనే ఆశతోనే నేను ఉంటున్నాను అని మహేంద్ర జగతిలో అంటాడు.
వసుధార నీ డ్రాప్ చేయటానికి వచ్చిన రిషి జగతి ఇంట్లోకి వచ్చి మహేంద్ర కోసం తెచ్చిన టాబ్లెట్స్ ఇచ్చి మనుషుల మీద ఉన్న కోపంతో మందులు వేసుకోకుండా ఉండకని చెప్పు వసుధర అని రిషి వెళ్ళిపోతాడు. రిషి వెళ్ళిపోగానే మహేంద్ర వసుధారను దగ్గరికి పిలిచి నువ్వు ఎప్పుడు రిషి పక్కనే ఉండు. రిషి ఎవరి మాటైన వింటాడు అంటే అది నీ ఒక్కదాని మాటే అని అంటారు. ఆ మాట వినగానే వసుధార మనసులో ఏదో ఆలోచన మొదలవుతుంది.
రిషి అన్నం తినకుండా ఉంటే దేవయాని నేను కూడా నువ్వు తినకుండా అన్నం తినలేను నాన్న అని చేతులు కడిగేస్తుంది. దాంతో రిషి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్లగానే రిషి ఫ్రెండ్ గౌతమ్ రిషి నీ చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది వదిన. ఎవ్వరితో ఏ విషయం చెప్పకుండా మనసులో దాచుకొని బాధపడతాడని అంటాడు.
రిషి ఏమీ తినకుండా కాలేజీకి వెళ్లాడని తెలుసుకున్న వసుధార రిషి కోసం క్యారేజ్ తీసుకొని వెళ్తుంది. కానీ రిషి మాత్రం వసు తెచ్చిన క్యారేజ్ తినటానికి ఒప్పుకో ఒప్పుకో. వసు రిషి చేత ఎలాగైనా అన్నం తినిపించాలి అనుకోని.. అన్నం తింటే మహేంద్ర సర్ గురించి రెండు విషయాలు చెప్తా అని అంటుంది. వసు ఎం చెప్తుందో అని రిషి వసుధార తెచ్చిన క్యారెజ్ తినటానికి ఒప్పుకుంటాడు. మరి ఋషి అన్నం తిన్న తర్వాత వసుధార మహేంద్ర గురించి ఏం విషయాలు చెప్పనుంది అనే విషయాలు తెలియాలంటే తరువాత ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.
Read Also : Guppedantha Manasu: మహేంద్ర చేసిన పనికి బాధతో కుమిలిపోతున్న రిషి..?