Shivaratri: హిందూ క్యాలెండర్ ప్రకారం హిందూ ప్రజలు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మహా శివరాత్రి రోజుశివుడు లింగ రూపంలోకి ఉద్భవించాడని అందుకు ప్రతిగా ప్రతి ఏడాది ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇకపోతే మహాశివరాత్రి రోజు పెద్దఎత్తున భక్తులు శివ ఆలయాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక అభిషేకము చేసి పూజించడమే కాకుండా ఉపవాసంతో తెల్లవార్లు జాగరణ చేస్తూ స్వామి వారిని పూజిస్తుంటారు.శివరాత్రి రోజు ఇలా ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారు ఇలా చేయడం వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయానికి వస్తే….
పురాణాల ప్రకారం ఒక బోయవాడు ప్రతిరోజు అడవికి వెళ్లి ఏదో ఒక జంతువును వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఒకరోజు బోయవాడు అడవి మొత్తం తిరిగిన ఆ బోయవాడికి ఏ జంతువు దొరకక పొయేసరికి అతనికి ఎంతో దిగాలుగా ఒక వృక్షం పై కూర్చుని ఆ వృక్షం ఆకులను తుంచి కిందకు వేశాడు. ఆ బోయవాడి ఎక్కిన వృక్షం బిల్వవృక్షం. ఆ వృక్షం కింద శివలింగం ఉన్న విషయాన్ని బోయవాడు గమనించలేదు. ఇక ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఆ బోయవాడు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉపవాసం ఉండి బిల్వదళాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేసి తెల్లవార్లు జాగరణ చేశాడు.
ఇలా తనకు తెలియకుండానే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ స్వామిని పూజించడం వల్ల ఆయనకు ఎంతో పుణ్యఫలం దక్కింది. ఆ బోయవాడు మరణించిన తర్వాత తనకు ఎలాంటి జన్మ లేకుండా ఏకంగా కైలాసానికి వెళ్లారని పురాణాలు చెబుతున్నాయి.ఇలా అప్పటినుంచి శివరాత్రి రోజు ఎవరైతే జాగరణ చేస్తూ ఉపవాసంతో స్వామిని పూజిస్తారో వారికి మరణాంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అందుకే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం అనేది అప్పటినుంచి ఆచరణలో ఉంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World