Peepal Tree : మన హిందూ పురాణాల ప్రకారం మనం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము. ఇలా దైవ సమానంగా భావించి వాటిని పెద్ద ఎత్తున పూజిస్తూ సాక్షాత్తు ఆ దేవుడు స్వరూపంగానే భావిస్తాము. ఈ క్రమంలోనే మనం ఎలాంటి పురాతన, ప్రాచీన ఆలయాలకు వెళ్లిన అక్కడ మనకు రావి చెట్టు దర్శనమిస్తుంది. రావి చెట్టును సాక్షాత్తు సకల దేవతల స్వరూపం అని భావిస్తారు. ముఖ్యంగా రావిచెట్టు మొదలు, కాండం, కొమ్మలలో త్రిమూర్తులు కొలువై ఉంటారని ఈ చెట్టు ఆకులలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే రావిచెట్టును పూజించడంవల్ల సకల దేవతల ఆశీర్వాదాలు మనపై ఉంటాయి.

are-you-stuck-with-financial-difficulties-if-worship-the-ravi-tree-like-this
ఇకపోతే రావిచెట్టు మీద లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అందుకే రావిచెట్టును పూజించడం వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, భక్తి శ్రద్ధలతో పూజించే వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కేవలం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాకుండా శని ప్రభావం దోషం ఉన్నవారు సైతం శనివారం సాయంత్రం రావి చెట్టుకింద ఆవ నూనెతో దీపం వెలిగించి రావి చెట్టును పూజించడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుంది.
అలాగే చాలా మంది సంతానం లేకుండా అలాగే మరికొందరు వివాహం ఆలస్యమవుతుంది ఎంతో సతమతమవుతుంటారు. అలాంటి వారు కూడా రావి చెట్టుకు పూజలు చేస్తే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం, వివాహం కాని వారికి వివాహ గడియలు దగ్గర పడతాయి. ఇలా ఆధ్యాత్మికంగా మనకు ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలంటే రావి చెట్టును పూజించడం వల్ల ఎన్నో ఇబ్బందులు తొలగిపోతాయి.ఈ విధంగా రావి చెట్టు ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గత కొన్ని శతాబ్దాల నుంచి రావిచెట్టును ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.
Read Also : Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?