Chiranjeevi: సుమను దగ్గరకు పిలిచి ఆమెతో ఫోటో దిగిన మెగాస్టార్…సుమ క్రేజ్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడిన చిరంజీవి యాంకర్ సుమ గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుమ యాంకర్ గా బుల్లితెరపై ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.

కేవలం బుల్లితెర కార్యక్రమాలకు మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్స్ అంటే తప్పనిసరిగా అక్కడ సుమ ఉండాల్సిందే. అంతగా కెరియర్ లో బిజీగా ఉన్న సుమ గురించి మెగాస్టార్ ప్రశంసలు కురిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవికి సుమ కృతజ్ఞతలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి సుమను దగ్గరకు పిలిచి ఆమె చేతిలో ఉన్న మైక్ తీసుకొని సుమ గురించి మాట్లాడారు.

Advertisement

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ తాను మాత్రం యాంకర్ సుమకు పెద్ద అభిమానినీ అంటూ చిరంజీవి మాట్లాడారు. సుమ ఎంతో అద్భుతంగా మాట్లాడుతుందని ఆమె వాక్చాతుర్యానికి నేను అభిమానిగా మారిపోయానని మెగాస్టార్ యాంకర్ సుమ ని పొగడటమే కాకుండా ఆమెతో కలిసి ఫోటోలు దిగారు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి సుమని పిలిచి తనతో ఫోటోలు దిగడంతో సుమ క్రేజ్ ఏంటో అందరికీ అర్థమవుతుంది.

Advertisement