R.K Roja: గత పది సంవత్సరాల నుంచి బుల్లి తెరపై ప్రసారం అవుతూ మంచి ఆదరణ సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో కీలకంగా ఉన్నారు. అయితే రోజా కు మంత్రి పదవి రావడంతో ఇక పై ఈమె బుల్లితెర, వెండితెర పై నటించనని చెప్పారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి ఈమె గుడ్ బై చెప్పడంతో జబర్దస్త్ టీమ్ తనకు ఘనంగా వీడ్కోలు చెప్పారు.
తాజా ఎపిసోడ్ లో జబర్దస్త్ నిర్వాహకులు మల్లెమాల వారు జబర్దస్త్ వేదికపై రోజాను ఘనంగా సత్కరించారు. ఇక ఈ ఎపిసోడ్ లో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ రోజాతో వారికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా సుడిగాలి సుదీర్ మాట్లాడుతూ తనకు మల్లెమాల వారితో ఎంత అనుబంధం ఉందో, రోజా గారితో కూడా అదే అనుబంధం, సపోర్ట్ ఉందని సుధీర్ రోజా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ రోజా కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.అలాగే ఆటో రాంప్రసాద్ కూడా రోజాతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోజా మాట్లాడుతూ… ఆ భగవంతుడి ఆశీస్సులు, నగరి ప్రజల ఆశీస్సులు ఉండటం వల్ల ప్రస్తుతం తన కల నెరవేరిందని, సర్వీస్ చేయడం తనకు చాలా ఇష్టం అందుకే తనకెంతో ఇష్టమైన వాటిని కూడా పక్కన పెట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World