Big Boss Akhil : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం రోజురోజుకు విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే కెప్టెన్సీ టాస్క్ ల విషయంలో ఈవారం కంటెస్టెంట్ ల మధ్య పెద్ద యుద్ధం జరిగింది.ఇలాంటి టాస్క్ లు విషయంలో ఆడ మగ అని తేడా లేకుండా తీవ్రస్థాయిలో కంటెస్టెంట్ లు గొడవ పడుతున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్లో ఎంతో చలాకీగా ఉన్నటువంటి అఖిల్ ఉన్నఫలంగా ప్లేట్ ఫిరాయించారు. అఖిల్ అజయ్, స్రవంతి, అషురెడ్డి, నటరాజ్‌లు ఒక గ్రూప్ గా ఉండేవారు.
అయితే స్రవంతి ఆరవ వారం ఎలిమినేట్ కావడంతో గ్రూప్ లోకి బాబా భాస్కర్ వచ్చారు. ఇక బాబా భాస్కర్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ఎంట్రీ గురించి అనిల్, అజయ్, బిందుమాధవి మాస్టర్ గురించి చర్చించుకున్నారు. బాబా భాస్కర్ మాస్టర్ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటారు అంటూ ఆయన గురించి చర్చలు మొదలు పెట్టారు. ఇలా అతని గురించి మాట్లాడుతుండగా మధ్యలో అనిల్ మాట్లాడుతూ బాబా భాస్కర్ మాస్టర్ ని బిగ్ బాస్ సంచాలక్ గా నియమిస్తే ఆయన గేమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
ఇలా అందరూ వారి పనులలో వారు నిమగ్నం కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు యాక్టివిటీలో భాగంగా బ్యాక్ స్టెప్ చేసే ఆ ఒక్కరు ఎవరు? ఎవరు మిమల్ని సేవ్ చేస్తారనే టాస్క్ కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ ఇచ్చాడు. ఇక ఈ టాస్క్ లో భాగంగా అఖిల్ మాట్లాడుతూ నాకు ఈ హౌస్లో ఎవరితోనూ అలాంటి బాండింగ్ లేదని తాను ఆ ట్యాగ్ ఎవరికి ఇవ్వలేనని తెలిపారు. అయితే టాస్క్ లో తప్పనిసరిగా ఎవరికో ఒకరికి ఈ ట్యాగ్ ఇవ్వాలని బిగ్ బాస్ సూచించడంతో అఖిల్ ఇన్ని రోజులు తనకు ఎంతో అండగా ఉన్నటువంటి అజయ్ ను వదిలిపెట్టి మిత్రశర్మ కు సేవ్ ట్యాగ్ ఇచ్చారు. ఇన్నిరోజులు అజయ్ ని వాడుకొని అఖిల్ తనని దూరం పెడితే బిందుమాధవి మాత్రం అజయ్ కి సేవ్ ట్యాగ్ ఇచ్చారు.
Read Also :Big Boss Non Stop: చీరకట్టులో అషురెడ్డి.. అషు అందాన్ని పొగుడుతూ కంట్రోల్ తప్పుతున్న నటరాజ్ మాస్టర్..!