ఏపీలో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న తెలుగు, హిందీ, ఇంగ్లీషు పేపర్లు లీకవ్వగా… తాజాగా కర్నూలు జిల్లా ఆలూరులో మరో సారి పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది. అయితే పరీక్ష జరుగుతుండగా.. ఓ యువకుడు అతని స్నేహితులకు కాపీ చిట్టీలు వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న విధుల్లో ఉన్న ఎస్సై యువకుడిని గుర్తించి పట్టుకున్నాడు. అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసి పరీక్షించగా… ప్రశ్నా పత్రం కనిపించింది. ఎస్సై ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన ఎస్పీ సుధఈర్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగి ఆలూరులో సర్కిల్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ప్రశ్నాపత్రం ఎలా వచ్చింది, ఎరు పంపారు, పేపర్ లీకులో ఎవరెవరి హస్తం ఉందన్న దానిపై విచారణ చేపట్టారు. అయితే గత కొంత కాలంగా ఏపీలో పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీకవ్వడంపై అధికారులు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.