Shreeja kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లోకి చేరింది. కల్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకున్న శ్రీజ ఇప్పుడు ఆయనతో విడిపోయినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయితే ఈ పుకార్లు చాలా రోజలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికి లేటెస్ట్‌గా శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ మార్చడం చూస్తుంటే విడిపోయినట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కల్యాణ్ దేవ్‌తో వివాహం అనంతరం వీరికి ఓ పాప పుట్టింది.
మొదట్లో బాగానే ఉన్న వీళ్ల రిలేషన్‌షిప్..గతేడాది జులై , ఆగస్ట్ నెలలో భేదాభిప్రాయాలు వచ్చినట్లుగా సమాచారం. ఆ సమయంలోనే ఇద్దరు విడాకులు తీసుకున్నారని,కాకపోతే ఆ విషయాన్ని మెగాఫ్యామిలీ బయట పెట్టలేదని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. మెగాస్టార్ చిన్న కూతురు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పేరు గతంలో శ్రీజ కల్యాణ్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పేరును తొలగించి శ్రీజ కొణిదెల అని మార్చుకుంది.దీన్ని బట్టి చూస్తుంటే కల్యాణ్‌దేవ్ తో తనకు రిలేషన్ షిప్ తెగిపోయిందని శ్రీజ చెప్పకనే చెప్పారా అనే డౌట్స్ మెగా అభిమానుల్లో కలుగుతున్నాయి. కల్యాణ్‌దేవ్ పేరు మాత్రమే కాదు..కల్యాణ్‌దేవ్‌ని తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి అన్ ఫాలో చేశారు శ్రీజ. తన అకౌంట్‌లో భర్త కల్యాణ్‌దేవ్ ఫోటోలు కూడా తీసివేయడం చూస్తుంటే మెగా డాటర్ విడాకుల విషయంలో వచ్చిన వార్తల్లో వాస్తవం ఉందా అనే డౌట్ అందరిలో కలుగుతోంది.
తాజా పరిణామాలు చూస్తుంటే శ్రీజ, కల్యాణ్‌దేవ్ ఇద్దరూ కలిసే ఉన్నారా లేదా అనే సందేహాలు అభిమానుల్లో కల్గుతున్నాయి.కాకపోతే ఎందువల్ల వీళ్లిద్దరు దాంపత్య జీవితాన్ని బ్రేక్ చేసుకున్నారనే వార్త మాత్రం బయటకు రావడం లేదు. రీసెంట్‌గా చిరంజీవి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కూడా ఎక్కడా కల్యాణ్‌దేవ్ కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే వీరిద్దరి బంధం తెగిపోయిందని అనుమానించాల్సి వస్తోంది.మెగా డాటర్ శ్రీజ ఫస్ట్ మ్యారేజ్ విషయంలోను రూమర్లు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత సద్దుమణిగాయి. ఆ తర్వాత రెండో మ్యారేజ్ కల్యాణ్‌దేవ్‌తో జరిగింది. అటుపై కల్యాణ్‌దేవ్ హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అంతా బాగానే ఉంటోదనుకున్న సమయంలో శ్రీజ మళ్లీ విడాకులు తీసుకున్నారట అనే వార్త తెరపైకి వచ్చింది. శ్రీజ ఇన్‌స్టా అకౌంట్ పేరు మార్చడం చూస్తుంటే అలాంటి రుమర్లకు బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. వార్తలు ఎలా ఉన్నా వాళ్లే స్వయంగా ప్రకటించే వరకూ వాళ్లిద్దరూ కలిసి ఉన్నట్లే.
Read Also : Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ షురూ… పాత కొత్త కంటెస్ట్స్‌తో రచ్చ