...

Phone Storage Full : మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్లయ్యిందా.? అయితే ఇలా చేయడం బెస్ట్..!

Phone Storage Full : కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ప్రతి క్షణాన్ని మధుర స్మృతులుగా మార్చుకోవాలనుకుంటాం. అందుకోసం అక్కడి దృశ్యాలను ఫొటోలు తీస్తుంటాం. కొన్నిసార్లు మొబైల్‌లో ఫొటో తీసుకునే సమయానికి స్టోరేజ్‌ ఫుల్ అనే సందేశం కనిపిస్తుంది. స్టోరేజ్‌ పరిమితి ఎంబీల నుంచి జీబీలకు మారినా.. చాలా మంది ఫోన్‌లో మెమొరీ సరిపోవడం లేదంటుంటారు. ఫోన్‌కు ఎస్‌డీ కార్డ్‌ సపోర్ట్‌ ఉంటే సరే. ఒకవేళ ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ లేకపోతే, కొత్తగా వచ్చే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ను ఫోన్‌లో స్టోర్‌ చేసేందుకు ఏం చేయాలో చూద్దాం.

Advertisement

యాప్‌ల వినియోగం పెరగటం కూడా ఫోన్‌ స్టోరేజ్‌ నిండిపోవడానికి కారణం. మనం తరచూ ఉపయోగించని యాప్స్‌ను డిలీట్ చేయడం ద్వారా ఫోన్‌లో స్టోరేజ్ సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం ఫోన్‌ సెట్టింగ్స్‌లో యాప్స్ సెక్షన్ ఓపెన్ చేసి మేనేజ్‌ యాప్స్‌పై క్లిక్ చేయాలి. అందులో మీ ఫోన్‌లో ఉన్న యాప్స్ జాబితా ఉంటుంది. వాటిలో మీ ఫోన్‌ స్టోరేజ్‌ను ఏయే యాప్స్ ఎంత ఉపయోగిస్తున్నాయనే సమాచారం ఉంటుంది. అందులోంచి మీరు ఉపయోగించని యాప్స్‌, అలానే అవసరంలేని ఎక్కువ స్టోరేజ్‌ ఆక్రమించిన యాప్స్‌ను సెలెక్ట్ చేసి అన్ఇన్‌స్టాల్ చేయాలి.

Advertisement

దాంతో మీ ఫోన్‌లో కొంత స్టోరేజ్‌ ఖాళీ అవుతుంది.ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లోను గూగుల్ ఫైల్స్‌ యాప్‌ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో మీకు ఫోన్‌ స్టోరేజ్‌, ఎస్‌డీ కార్డ్ సెక్షన్‌లతోపాటు ఫొటో, ఆడియో, వీడియోతోపాటు డాక్యుమెంట్స్‌ల ఫోల్డర్లను చూపిస్తుంది. తర్వాత కుడివైపు పైభాగంలో మూడు చుక్కలపై క్లిక్ చేస్తే అందులో అనాలసిస్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే మీకు పెద్ద సైజు ఉన్న ఫైల్స్‌ జాబితా కనిపిస్తుంది. వాటిలో మీకు అవసరంలేని ఫైల్స్‌ను డిలీట్ చేస్తే మీ ఫోన్‌లో ఒకేసారి ఎక్కువ మొత్తం స్టోరేజ్‌ లభిస్తుంది.

Advertisement

మెసేజింగ్‌ నుంచి ఫొటో, వీడియో, డాక్యుమెంట్ షేరింగ్ దాకా వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో రోజూ మనకు స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగుల నుంచి ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలు వస్తుంటాయి. వాటితో మన ఫోన్‌ గ్యాలరీ నిండిపోతుంది. సదరు ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేందుకు వాట్సాప్ స్టోరేజ్ మేనేజర్‌ను ఉపయోగించుకోవాలి. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్‌ అండ్‌ డేటా ఓపెన్ చేసి మేనేజ్‌ స్టోరేజ్‌పై క్లిక్ చేయాలి.

Advertisement

అందులో 5ఎంబీ కన్నా పెద్ద సైజు ఉన్న ఫైల్స్ జాబితా కనిపిస్తుంది. వాటిలో మీకు అవసరంలేని వాటిని సెలెక్ట్‌ చేసి డిలీట్ చేస్తే కొంత ఫోన్‌ మెమొరీ ఖాళీ అవుతుంది.ఫోన్‌ మెమొరీ వీలైనంత వరకు ఖాళీగా ఉంచేందుకు క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగించుకోవడం ఉత్తమం. మీ ఫోన్‌లో ఉండే ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను గూగుల్ ఫొటోస్, డ్రైవ్‌తోపాటు వన్‌ క్లౌడ్‌ వంటి వాటిలో సేవ్ చేసుకోవచ్చు. ఫోన్‌లో స్టోరేజ్‌ సమస్యను అధిగమించేందుకు ఉన్న మరో మార్గం యాప్‌ క్యాచి క్లియర్.

Advertisement

మనలో చాలా మంది పొరపాటుగా క్యాచి క్లియర్‌ చేయడానికి బదులు స్టోరేజ్ క్లియర్‌పై క్లిక్ చేసి యూజర్ డేటాను పొగొట్టుకుంటారు. అందుకే క్యాచి క్లియర్ చేసేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లో యాప్‌ సెక్షన్‌పై క్లిక్ చేస్తే యాప్స్‌ జాబితా కనిపిస్తుంది. అందులో ఏ యాప్‌ క్యాచి క్లియర్‌ చేయాలనుకుంటున్నామో దాన్ని ఓపెన్ చేయాలి. తర్వాత స్టోరేజ్‌పై క్లిక్ చేస్తే క్లియర్‌ డేటా, క్లియర్ క్యాచి అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో క్లియర్ క్యాచిపై క్లిక్ చేస్తే మీ ఫోన్‌ మెమొరీ కొంత ఖాళీ అవుతుంది.

Advertisement

Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…

Advertisement
Advertisement