...

Sai pallavi: ఫోటో పెట్టి సస్పెన్స్ క్రియేట్ చేసిన సాయి పల్లవి..!

Sai pallavi: విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సాయి పల్లవి. తన నటనతో అందరినీ మెప్పించింది సాయ పల్లవి. అంతకు మించి తన వ్యక్తిత్వం అంటే అందరికీ చాలా ఇష్టం. పద్ధతిగా ఉండే సాయి పల్లవి అంటే చాలా మందికి మక్కువ. ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మనసును ఎప్పుడో దోచేసుకుంది ఈ ఫిదా భామ. అతి తక్కువ సమయంలోనే లేడీ పవన్ కల్యాణ్ గా పేరు, పేరుతో పాటు అభిమానులను సంపాదించుకుంది సాయి పల్లవి.

ప్రేమమ్‌తో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన సాయి పల్లవి… శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ తో గ్రాండ్‌గా టాలీవుడ్‌ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ తనదైన అందం, అభినయం, నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఏమైందో ఏమో గానీ.. గత కొద్ది రోజుల నుంచీ సాయి పల్లవి ఎటువంటి కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి భారీ హిట్స్ పడినా సాయి పల్లవి సైలెంట్‌ గానే ఉంది.

దీంతో సాయి పల్లవి పెళ్లి పీటలెక్కబోతోందని, అందుకు కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ టేకప్ చేయడం లేదంటూ వార్తలు ఊపందుకున్నాయి. గత మూడు రోజుల నుంచీ సాయి పల్లవి పెళ్లి వార్తే నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇలాంటి తరుణంలో సాయి పల్లవి ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఒక ఫొటో అందరినీ సస్పెన్స్‌ లోకి నెట్టేసింది. ఈ ఫొటోలో చీర కట్టుకున్న ఓ పల్లెటూరి యువతి బ్యాగు వేసుకుని ఫేస్ చూపించకుండా పరిగెడుతూ కనిపిస్తోంది. దాంతో అసలేంటా ఫొటో..? సాయి పల్లవి కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పిక్కా..? లేక మరేదైనానా? అంటూ రకరకాల చర్చలు మొదలయ్యాయి.

సాయి పల్లవి క్రియేట్ చేసిన సస్పెన్స్‌కు తానే ఎండ్‌ కార్డు వేసేసింది. తన తదుపరి సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రేక్షకులతో పంచుకుంది. సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ‘గార్గి’ చిత్రంలో తాను నటిస్తున్నట్లు వెల్లడించింది సాయి పల్లవి. తన సంతోషాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. గౌతమ్ రామచంద్రన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కనుంది. సాయి పల్లవి ఇందులో న్యాయం కోసం పోరాడే మహిళగా కనిపించనుంది.