RRR Rajamouli : ఈ మధ్య కాలం లో ప్రతి పెద్ద సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. అది కొందరు కావాలని చేస్తున్నారు.. కొన్ని వివాదాలు జెన్యూన్ గా ఉన్నాయి. కొందరు పబ్లిసిటీ కోసం పెద్ద సినిమాలను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది అంటూ అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు.
తమ కుటుంబ పెద్దాయన అయిన అల్లూరి సీతారామరాజు పాత్ర అని తప్పుగా చూపించడంతో పాటు ఆయనను అవమానించినట్లు గా రాజమౌళి వ్యవహరిస్తున్నాడు అంటూ ఆయన మనవడు మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే రాజమౌళి తమ కుటుంబానికి క్షమాపణ చెప్పడంతో పాటు ఆ పాత్రకు సంబంధించిన వివాదాస్పద అంశాలను తొలగించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. సినిమా ప్రారంభమై నాలుగు సంవత్సరాలు కావస్తోంది. ఈ నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా చూపించబోతున్నాం అని రాజమౌళి చెప్పాడు.
అయినా కూడా ఇప్పుడు సినిమా విడుదల సమయంలో అల్లూరి మనవడిని అంటూ మీడియా ముందుకు రావడం కేవలం ప్రచారం కోసమే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఒకవేళ నిజంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తి అల్లూరి సీతారామరాజు మనవడు అయితే ఇన్నాళ్లు తనకు అల్లూరి పై ఉన్న గౌరవం కూడా పోతుంది. ఇలాంటి ఒక మనవడు ఉన్నందుకు ఆయనపై నమ్మకం.. ఇంట్రెస్ట్ పోతుంది అంటూ వర్మ తనదైన శైలిలో విభిన్నమైన వ్యాఖ్యలను చేశాడు.
Read Also : RRR Full Journey : RRR జర్నీ… అలా మొదలై ఇలా ఎండ్ అయ్యింది.. పూర్తి వివరాలు ఇవే..!