Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
జానకి రామచంద్ర లను బయటికి గేంటేసి ముఖం మీద వాకిలి వేస్తుంది జ్ఞానాంబ. దీనితో రామచంద్ర, జానకి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఇక ఇంటిలోపల జ్ఞానాంబ కుటుంబమంతా బాధపడుతూ ఉంటారు. మరొకవైపు జ్ఞానాంబ దంపతులు జరిగిన దాని గురించి తెలుసుకునే బాధపడుతూ ఉంటారు.
అప్పుడు జ్ఞానాంబ,నా బిడ్డకు ఈ అమ్మ మీద ప్రేమను జానకి పూర్తిగా చంపేస్తుంది అని గోవిందరాజు తో అంటుంది. దీనికి అంతా ముఖ్యకారణం జానకినే అంటూ జానకి పై తీవ్రస్థాయిలో మండిపడుతోంది జ్ఞానాంబ. తన బిడ్డను తనకు కాకుండా చేస్తుంది అంటూ బాధపడుతూ ఉంటుంది.
మరొకవైపు రామచంద్ర ఇంటి బయట కూర్చుని ఈ బాధను భరించడం కంటే చనిపోవడం మేలు అని అనడంతో జానకి అలా అనకండి రామ గారు అని అంటుంది. అప్పుడు రామచంద్ర తన తల్లితో ఉన్న జ్ఞాపకాలను అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక రాత్రికి రాత్రి జానకి, రామచంద్ర లు ఇంటికి ఎదురుగా కొట్టం వేసుకుని ఉంటారు.
రోజు ఉదయాన్నే మల్లిక ముగ్గు వేయడానికి డాన్స్ చేస్తూ వస్తుంది. ఇంటి ముందు కొట్టం ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిన మల్లిక ఇంట్లోకి వెళ్లి జ్ఞానాంబను పిలుచుకొని వస్తుంది. అది చూసిన జ్ఞానాంబ కూడా షాక్ అవుతుంది. ఇంతలో ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చి సంతోషిస్తూ ఉంటారు. గీత గోవింద రాజు అయితే నువ్వు సూపర్ అంటూ రామచంద్ర పొగుడుతూ ఉంటాడు.
కానీ జ్ఞానాంబ మాత్రం లోపల సంతోషపడుతూ బయటకు మాత్రం కోపాన్ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర నానమ్మ ఇచ్చిన స్థలంలో నాకు ఉండే హక్కు లేదా అని అనడంతో ఇన్ని రోజులు మన అనేవాడివి ఇప్పుడు నీ నోటి నుంచి మొదటి సారి నా అని వినిపిస్తోంది. నీతో ఇలా ఎవరు మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసు అంటూ జ్ఞానాంబ జానకి పై మరింత కోపాన్ని పెంచుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..