R.K Roja Daughter: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆర్ కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా తాజాగా మంత్రి పదవిని కూడా అందుకున్నారు. ఈ విధంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తున్నటువంటి రోజా కూతురు అన్షు మాలిక గురించి కూడా అందరికీ తెలిసిందే.
అన్షు మాలిక వయసులో చాలా చిన్నదే అయినప్పటికీ ఈమెకు సేవాగుణం మాత్రం ఎక్కువగా ఉందని చెప్పాలి. తన తల్లిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇంత చిన్న వయసులోనే అన్షు మాలిక వెబ్ డెవలపర్ గా, కంటెంట్ క్రియేటర్ గా, రైటర్ గా, సోషల్ వర్కర్ గా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారికి సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ఈమె ట్రాన్స్ ఫార్మింగ్ లైఫ్ విత్ కోడింగ్ అనే పేరుతో ఒక స్కూల్ క్లబ్ కూడా ఏర్పాటు చేశారు.
అదేవిధంగా పేద పిల్లల కోసం ఉచితంగా ట్యూషన్ చెప్పించడమే కాకుండా వారి చదువుకు కావలసిన పుస్తకాలు ఇతర సామాగ్రిని కూడా వారికి అందిస్తూ ఉండేది. ఇంత చిన్న వయసులోనే ఐదుగురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి పూర్తి బాధ్యతలను అన్షు ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా హండ్రెడ్ స్మైల్ అనే ఫౌండేషన్ ద్వారా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి పై చదువులు చదవడానికి ఈమె చేస్తున్న కృషి అందరికీ ఎంతో ఆదర్శంగా నిలవడమే కాకుండా ఇంత చిన్న వయసులో ఇలాంటి ప్రజాసేవ చేస్తూ ఉన్నందుకు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా ప్రజాసేవ చేస్తూ తల్లికి తగ్గ తనయ అనే పేరును సంపాదించుకున్నారు.