Suma Kanakala: జయమ్మ విషయంలో సుమకు తీవ్ర అన్యాయం… మండిపడుతున్న అభిమానులు!

Suma Kanakala:సుమ కనకాల ప్రధానపాత్రలో తెరకెక్కిన జయమ్మ పంచాయతీ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైనప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయిందనే చెప్పాలి. మిశ్రమ స్పందనతో ప్రసారం అవుతున్న ఈ సినిమా మూడు కోట్ల షేర్స్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా విజయం సాధించాలంటే 3.5 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలని తెలుస్తోంది.ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో సుమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సుమ జయమ్మ పంచాయతీ సినిమా మే 6వ తేదీ విడుదల అయింది. అయితే ఓకే రోజే మూడు సినిమాలు విడుదల అయ్యాయి. జయమ్మ పంచాయతీతో పాటు విశ్వక్సేన నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం, శ్రీ విష్ణు నటించిన భళ తందానా సినిమాలు కూడా అదే రోజున విడుదల అయ్యాయి. ఈ సినిమాలతో పాటు ఇప్పటికి పలు చోట్ల రాజమౌళి త్రిబుల్ ఆర్, యశ్ కేజిఎఫ్ సినిమాలు కూడా రన్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే సుమ నటించిన జయమ్మ పంచాయతీ సినిమా కేవలం కొన్ని థియేటర్లకు మాత్రమే పరిమితమైంది.

అలా కాకుండా ఈ సినిమాని అత్యధిక థియేటర్లలో విడుదల చేసి ఉంటే కనుక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టేది అంటూ ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సినిమా థియేటర్ విషయంలో మాత్రం సుమకు తీవ్ర అన్యాయం జరిగింది అంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు వీకెండ్ కావడంతో ఆదివారమైనా సుమ జయమ్మ పంచాయతీ సినిమాకి కలిసి వస్తుందేమో చూడాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel