RGV Comments : ఏపీలోని థియేటర్స్‌లో సినిమా టికెట్ల ధరలు ప్రభుత్వం నిర్ణయించడాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కారుపైన తన దైన స్టైల్‌లో సెటైర్స్ వేస్తున్నారు. టికెట్ల ప్రైసెస్ ఇష్యూను రాజమౌళికి లింక్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వర్మ. సదరు కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి అని, రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సినిమాతో తెలుగు కళా కారుల సత్తా ప్రపంచానికి తెలిసిందని రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. ఈ క్రమంలోనే ఏపీ టికెట్స్ ఇష్యూను రాజమౌళికి లాజికల్ గా లింక్ చేశాడు వర్మ. హాలీవుడ్ మూవీ రేంజ్‌లో ‘బాహుబలి’ చిత్రాన్ని రాజమౌళి తీశాడని, రాజమౌళి వలన ప్రజెంట్ తెలుగు సినిమాకు యావత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని చెప్పుకొచ్చాడు వర్మ.
RGV.. రాజమౌళికి ప్రభుత్వం రివార్డు ఇవ్వాలి :
రాజమౌళి వల్లనే ‘కేజీఎఫ్, పుష్ప’ సినిమాలకు దారి పడిందని, తద్వారా రెవెన్యూ పెరిగిందని, ఫలితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో లాభం వస్తుందని వివరించాడు వర్మ. ఈ నేపథ్యంలోనే తన ఉద్దేశంలో రాజమౌళి లాంటి వారిని ఎంకరేజ్ చేయాలని, ప్రభుత్వం వారికి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వాలని కోరారు. టికెట్ల ధరలు తగ్గించడం పక్కనబెట్టి.. రాజమౌళికి ప్రభుత్వం రివార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా రాజమళి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు రాజమౌళి చేసిన సేవలను డబ్బులతో మెజర్ చేయలేమని, అది ఎప్పటికీ అలానే నిలిచిపోతుందని పేర్కొన్నాడు వర్మ. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఏపీ టికెట్స్ ప్రైసెస్ వ్యవహారంలో దూరిపోయారు. హీరో నాని, వైసీపీ ఎమ్మెల్యే రోజా , ప్రొడ్యూసర్స్, ఆర్.నారాయణమూర్తి ఈ విషయాల గురించి మాట్లాడుతుండగా, మధ్యలో వర్మ సైతం ఇందులోకి వచ్చేశాడు.
Read Also : Roja Comments Nani : నాని ఆ బిజినెస్ చేసుకోవడం బెటర్.. ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world