ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అయితే వివాహానికి ముందే హీరో రణ్‌బీర్ కపూర్ తనకు కాబోయే భార్య హీరోయిన్ ఆలియా భట్‌కు ఖరీదైన కానుక ఇచ్చారు. ఆమెకు ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన ఓ కాస్ట్లీ బ్యాండ్‌ను బహూకరించారని టాక్ నడుస్తోంది.
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని రణ్‌బీర్ నివాసం ‘వాస్తు’లో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేమ పక్షులకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. రణ్‌బీర్ తనకు కాబోయే భార్యకు అత్యంత ఖరీదైన కానుక ఇచ్చారని బీ టౌన్ కోడై కూస్తోంది. ఈ ముద్దు గుమ్మ కోసం ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన కాస్ట్లీ బ్యాండ్ ను తయారు చేయించి ఇచ్చారట. లండన్ నుంచి దీన్ని తెప్పించారని టాక్ నడుస్తోంది. ఈ వజ్రాల బ్యాండ్ ను ఆలియా భట్ వివాహ వేడుకలో ధరించనుంది అని సన్నిహితులు చెబుతున్నారు.
ఇప్పుడు రణ్ బీర్ ఇచ్చిన గిఫ్ట్ కు ప్రత్యేకత ఏమిటి అంటే 8 సంఖ్య. ఆ సంఖ్య కపూర్ కుటుంబానికి లక్కీ నంబర్ అంట. మరో వైపు ఆలియాకు కూడా 8 సంఖ్య లక్కీ నంబరు అని తెలిసింది. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వజ్రాలు పొదిగిన బ్యాండ్‌ను రణ్‌బీర్ బహూకరించారని అంతా అనుకుంటున్నారు. ఘనంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, వరుణ్ ధావన్, అయాన్ ముఖర్జీ, జోయా అక్తర్, అర్జున్ కపూర్, మసాబా గుప్తా, కరణ్ జోహార్, కరీష్మా కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.