...

Railway recruitment board: సీబీటీ-2 హాల్ టికెట్స్ అందుబాటులో ఎప్పటి నుంచో తెలుసా?

Railway recruitment board: ఇటీవల రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఎన్టీపీసీ సీబీటీ-2 కి సంబంధించి సిటీ స్లిప్ ను అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో బోర్డు అడ్మిట్ కార్డును సైతం త్వరలోనే విడుదల చేయనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అడ్మిట్ కార్డును మే 5న విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్టీపీసీ రెండో దశ పరీక్షలను మే 9, 10వ తేదీల్లో నిర్వహించబోతున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా 4, 6 లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అదే విధంగా పే లెవెల్స్ 2, 3, 5 స్థాయి ఉద్యోగాల కోసం పరీక్ష షెడ్యూల్ ను రెండో పరీక్షల తర్వాత ప్రకటించనున్నట్లు ఆర్ఆర్బీ పేర్కొంది.

పరీక్షా విధానం.. పరీక్ష రాయడానికి అభ్యర్థులకు 90 నిమిషాల సమయం కేటాయించనున్నారు. మొత్తంగా 120 ప్రశ్నలు అడగనున్నారు. అందులో జనరల్ అవేర్ నెస్ నుంచి 50, గణితం 35, జనరల్ ఇంటిలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 35 ప్రశ్నలు ఉండనున్నాయి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పరీక్ష రాయడానికి 120 నిమిషాల సమయం కేటాయించనున్నారు. అయితే పీడబ్య్లూబీడీ అభ్యర్థుల తరఫున వారి వెంట వచ్చిన వ్యక్తి పరీక్ష రాయనున్నారు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ తో ఆబ్జెక్టివ్ టైపులో ఉండనున్నాయి.