Akshaya Tritiya: మహిళలకు ఎంతగానో నచ్చే, వారు మెచ్చే వాటిలో బంగారు నగలు ఒకటి. బంగారం అంటే మహిళలకు ఎనలేని ప్రీతి అని చెప్పవచ్చు. ఇలా ఏదైనా చిన్న ఆకాశం వచ్చిందంటే చాలు వెంటనే బంగారు నగలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు.ఇక నేడు అక్షయ తృతీయ కావడంతో పెద్ద ఎత్తున మహిళలు వెండి బంగారు నగలను కొనుగోలు చేస్తారు. ఈ విధంగా అక్షయ తృతీయ రోజు బంగారు నగలను కొనుగోలు చేయడం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయని భావిస్తారు.
ఈ క్రమంలోనే నేడు అక్షయ తృతీయ కావడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. కేవలం బంగారు ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా తగ్గాయి. మరి నేడు బంగారు వెండి ధరలు ఎంత తగ్గాయి, ప్రాంతాలవారీగా ఎంత ధరలు ఉన్నాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం… నిన్నటితో పోలిస్తే నేడు బంగారంపై కుమారు 1190 రూపాయలు తగ్గినట్టు తెలుస్తోంది. నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 47200 రూపాయలు ధర ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 51,510 రూపాయలు ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 47,200, 24 క్యారెట్ల బంగారం 51,510 రూపాయలు ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 48,550 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 52,970 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలు నిన్నటితో పోలిస్తే కేజీ వెండి పై 1900 రూపాయలు ధర తగ్గింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాలలో కిలో వెండి 67, 600 రూపాయలు ఉండగా, ముంబై ఢిల్లీ లో కిలో వెండి 62,700 రూపాయలు ఉంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World