Life in america : చాలా మందికి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాలని ఉంటుంది. చాలా మంది కల ఇది. అయితే అక్కడ గ్రీన్ కార్డు పొంది లగ్జరీ లైఫ్ అనుభవించాలన కోరుకుంటారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి మెల్లగా అక్కడే నివసించాలన్నది అనేక మంది అతిపెద్ద కల. సాధారణంగా యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దైశాల్లో ఒకటి. అయితే ఇదే సమయంలో చాలా మంది ప్రజలు ఎక్కువగా ఇష్టపడే దేశం కూడా. ఎప్పుడైనా అమెరికాలో ఉండేందుకు ఎంత డబ్బు కావాలని అలోచించారా.. ఆలోచిస్తే ఎంత కావాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికన్లు 7,74,000 డాలర్లు అంటే ఆర్థికంగా సుఖంగా ఉంటారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. ఈ విషయాన్ని సీఎన్బీసీ నివేదిక వెల్లడిస్తోంది. అయితే యూఎస్ లో నివసించే నగరాన్ని బట్టి పైన పేర్కొన్న మొత్తం మారుతుంది. అసలు అమెరికాలోని ఏఏ నగరాల్లో నివసించడానికి ఎంత డబ్బు కావాలో ఇప్పుడు గమనిద్దాం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో సుఖంగా ఉండాలంటే 1. 7 మిలియన్ డాలర్లు, న్యూయార్క్ నగరంలో 1.4 మిలియన్ డార్లు, దక్షిణ కాలిఫోర్నియా 1.3 మిలియన్ డాలర్లు, సీటెన్ 1.2 మిలియన్ డాలర్లు, వాషింగ్టన్ 1.1 మిలియన్ డాలర్లు, చికాగో 9 లక్షల 53 వేల డాలర్లు, హ్యూస్టన్ 9 లక్షల 19 వేల డాలర్లు, బోస్టన్ 8 లక్షల 82 వేల డాలర్లు, డల్లాస్ 7 లక్షల 71 వేల డాలర్లు, అట్లాంటా 7 లక్షల 71 వేల డాలర్లు, ఫీనిక్స్ 7 లక్షల 47 వేల డాల్రలు, డెన్వర్ 6 లక్షప 71 వేల డాలర్లు కావాలి.
Read Also : Viral video : మేకపోతుతో తలపడిన యువకుడు.. చివరికి ఏం జరిగిందో తెలుసా..?