Rahul Ramakrishna : అర్జున్ రెడ్డి సినిమాతో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ అందరికి సుపరిచితమే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత భరత్ అనే నేను, జాతి రత్నాలు, త్రిబుల్ ఆర్ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని నేడు అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
తనకు కాబోయే భార్యని ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఫోటోని ద్వారా షేర్ చేస్తూ ఫైనల్ గా పెళ్లిచేసుకోబోతున్నానని వెల్లడించారు.ఈ విధంగా రామకృష్ణ తన పెళ్లి విషయాన్ని చెబుతూ తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని ఆరా తీస్తున్నారు. అయితే రాహుల్ రామకృష్ణ ఆ అమ్మాయి గురించి ఎక్కడ ప్రస్తావించ లేదు.
ఇక సోషల్ మీడియా వేదికగా ఆయన అధికారికంగా తన పెళ్లి విషయాన్ని ప్రకటించడంతో ఎంతో మంది నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా కమెడియన్ రాహుల్ రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే రాహుల్ రామకృష్ణ తాజాగా హీరో విశ్వక్సేన్ విషయంలో ఆయనకు మద్దతుగా నిలబడి ప్రముఖ న్యూస్ ఛానల్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. మొత్తానికి కమెడియన్ గా గుర్తింపు పొందిన ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనీ తెలియజేశారు అయితే పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
Read Also : Jr NTR: ఎన్టీఆర్ కొత్తగా కొనుగోలు చేసిన ఇంటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… ఏకంగా అన్ని కోట్లా?
Tufan9 Telugu News And Updates Breaking News All over World