...

Anchor Anasuya: వామ్మో.. ఒక్కరోజు కాల్షీట్ కోసం అనసూయ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anchor Anasuya: యాంకర్ అనసూయ ఈ పేరు తెలియని వారు ఉండరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుసగా వెండితెర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా ఒకవైపు వెండితెర సినిమాలు అలాగే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలతో అనసూయ తన కెరియర్లో ఎంతో బిజీగా ఉండి పోయారు. ఇలా కెరీర్ లో బిజీగా ఉన్న అనసూయ భారీ మొత్తంలోనే డబ్బును కూడా సంపాదిస్తున్నారు.జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు పెద్దగా పరిచయం లేని ఈమె ఈ కార్యక్రమం ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

అలాగే రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను మరింత సందడి చేశారు. ఈ పాత్ర ద్వారా వెండితెర ప్రేక్షకులను మెప్పించిన అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండిపోయారు.ఇకపోతే సినిమాల్లో నటిస్తున్న అనసూయ ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే అనసూయ సినిమా కోసం ఒకరోజు కాల్షీట్స్ ఇస్తే సుమారు ఐదు నుంచి ఆరు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.

ఇలా ఈమె పది రోజుల పాటు వరుసగా కాల్షీట్స్ ఇస్తే సుమారు ఒక్కో సినిమాకి 50 లక్షలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.అలాగే ఈమె పాత్ర నిడివి ఎంత ఎక్కువగా ఉంటే ఈమె అన్ని లక్షల రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకుంటారని చెప్పాలి.తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ఈ సినిమాలో తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఏకంగా 40 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఏదిఏమైనా అనసూయ వరుస సినిమాలు బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండి పోయారు.