...

Mega Brothers: అమ్మతో మెగా బ్రదర్స్… మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్.. వీడియో వైరల్!

Mega Brothers: నేడు మాతృ దినోత్సవం కావడంతో ఎంతో మంది వారి మాతృమూర్తులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తల్లి అంజనాదేవికి అలాగే మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ సందర్భంగా నేడు మదర్స్ డే కావడంతో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తన ఇద్దరు తమ్ముళ్ళు తల్లితో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు ముగ్గురు కలిసి తన తల్లితో ఉన్నటువంటి వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోకి పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా నుంచి వచ్చిన మగవా..మగువా.. అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం ఈ వీడియోకి ఎంతో హైలెట్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ వీడియోని మెగాస్టార్ షేర్ చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాస్త విరామం తీసుకుని తన భార్య సురేఖతో కలిసి విదేశీ పర్యటన వెళ్లి సంగతి మనకు తెలిసిందే.దాదాపు నెల రోజుల పాటు మెగాస్టార్ చిరంజీవి అమెరికా యూరప్ వంటి ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం తిరిగి ఇండియా చేరుకోనున్నారు. ఇకపోతే మెగాస్టార్ ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు అయితే ఈ షూటింగ్ లకు కాస్త విరామం తీసుకొని ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు.