Anchor suma kanakala : బుల్లి తెరపై మకుటం లేని మహారాణిగా రాణిస్తున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం యాంకర్ గానే కాకుండా ఎన్నో అడ్వర్ టైజ్ మెంట్లు, ఆడియో, వీడియో ఫంక్షనలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో తెగ బిజీగా ఉంటుంది. అయితే తాజాగా ఈమె జయమ్మ పంచాయతీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత సము వెండి తెరపై సందడి చేయబోతోంది.
కాగా… ఈ సినిమా చేసేటప్పుడు ఆమె ఓ ప్రమాదానికి గురైంది. అడవిలో షూటింగ్ చేసే సమయంలో అక్కడ ఉన్న ఓ కాలువ దగ్గర నిల్చుంది. సడెన్ గా కాలు జారడంతో స్లిప్ అయింది. అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యాంకర్ సుమ ప్రేక్షకులతో పంచుకుంది. జయమ్మ పంచాయతీ సినిమా షూటింగ్ లో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ అక్కా జాగ్రత్త అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram