...

వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ప్రభాస్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. సలార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా రామాయణం నేపథ్యంలో ఉండనుందట. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించనున్నారు. ఈ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ప్రాజెక్టు కే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్,దీపికా పడుకొనే నటిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్,విడుదల మరింత ఆలస్యం కానున్నట్టు టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో అశ్వినీదత్ స్పందిస్తూ.. ఈ సినిమా షూటింగు మరింత ఆలస్యం అవుతుందనే ప్రచారంలో నిజం లేదు. పరిస్థితులు చూసుకొని ఈ నెల చివరిలో మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంత వరకు వచ్చే ఎండాకాలంలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నామని అన్నారు