...

Petrol Price Hike : మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధలు.. 12 రోజుల్లోనే రూ.7.20 వడ్డన

Petrol Price Hike : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ వ్యాప్తంగా ధరలు పెంచుతూ చమురు సంస్థలు మరోసారి నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరను 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజా నిర్ణయంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.61కు చేరుకుంది. అలాగే డీజిల్ ధర రూ.93.87కు చేరింది. కాగా, 12 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు పదోసారి పెరిగాయి. దీంతో ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ ధర రూ.7.20 మేర పెరిగింది.

  •  ముంబయిలో పెట్రోల్, డీజిల్ ధరలు 85 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.117.57కు చేరగా.. డీజిల్ ధర రూ.101.79కు పెరిగింది.
  • హైదరాబాద్​లోనూ లీటర్ పెట్రోల్​పై 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్ ధర 87 పైసలు పెరగగా… దీంతో నగరంలో పెట్రోల్ ధర రూ.116.3కు చేరుకుంది. డీజిల్ ధర రూ.102.43కు ఎగబాకింది.

    Petrol Prices Today
    Petrol Prices Today
  • గుంటూరులో లీటర్ పెట్రోల్ 88 పైసలు పెరిగి రూ.118.2కు చేరుకుంది. డీజిల్ ధర 84 పైసలు అధికమై రూ.103.94కు పెరిగింది.
  • వైజాగ్​లో పెట్రోల్ ధర 87 పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.116.91కు చేరింది. అటు, డీజిల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.102.7కు ఎగబాకింది.

Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?