Runa Vimochana Ganesh Sthothram : మీకు ఆదాయం ఎక్కువగా వస్తున్నా చేసిన అప్పులు అస్సలే తీరడం లేదా.. డబ్బులిచ్చిన వాళ్లు వెంట పడి వేధిస్తున్నారా.. మీకిచ్చే వాళ్లు మాత్రం ఇప్పుడే కాదంటూ కాలం దాట వేస్తున్నారా.. ఈ సమస్యలన్నిటి జీవితం మీదే విరక్తి కల్గుతోందా.. అయితే ఈరోజే మీరు రుణ విమోచన స్తోత్రాలు చదివి మీ బాధలను తీర్చుకుోండి. ఈరోజు అనగా ఏప్రిల్ 20 బుధవారం చవితి నాటి నుంచి ఎవరైతే ఈ ఐదు స్తోత్రాలు చదువుతారో వారు కచ్చితంగా బుణ విముక్తులవుతారని వేద పండితులు సూచిస్తున్నారు. అయితే ఆ స్తోత్రాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఋణ విమోచన గణేష స్తోత్రం, ఋణ విమోచన అంగారక స్తోత్రం, ఋణ విమోచన లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రం, దారిద్ర దహన శివ స్తోత్రం, అలాగే కనకధారా స్తోత్రం. ఈ ఐదు స్తోత్రాలను ఉదయం కానీ సాయంత్రం కానీ దీపాలు పెట్టే వేళల్లో చదవడం వల్ల మీ అప్పులన్నీ తీరిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భక్తి, శ్రద్ధలతో శుచి, శుభ్రత పాటిస్తూ మాత్రమే ఈ స్తోత్రాలు చదవాలని వివరిస్తున్నారు. అయితే ఈ ఐదు స్తోత్రాలు ఋషి ప్రోక్తమైనవని వీటికి ఎవరి ఉపదేశం అవసరం లేదని చెబుతున్నారు. దేవుడి ముందు దీపం వెలిగించి.. ఈ స్తోత్రాలు చదవడం వల్ల మీకున్న ఆర్థిక కష్టాలు అనతి కాలంలోనే తీరిపోతాయని చెబుతున్నారు.
Read Also : Hanuman Chalisa : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. హనుమాన్ చాలీసా చదవాల్సిందే!