Janaki Kalaganaledu Mar 11th Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..జానకి గర్భవతి కాదు అన్న విషయం తెలుసుకున్న జ్ఞానాంబ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర తన తల్లిని ఓదారుస్తూ అన్నా నువ్వు బాధపడకు నువ్వు సంతోషించే రోజు తప్పకుండా వస్తుంది అని జ్ఞానాంబ తో చెబుతాడు. ఆ విషయంలో చాలా బాధ పడిన జ్ఞానాంబ రామచంద్ర మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక మల్లికా జానకి గర్భవతి కాదు అన్న విషయం తెలిసినప్పటి నుంచి ఆనందం తో గంతులేస్తోంది. అంతేకాకుండా జానకి కి పూర్తిగా కడుపు రాకుండా చేయాలి అని ప్లాన్ కూడా వేసింది. మరొకవైపు జ్ఞానాంబ, రామచంద్ర, జానకి లను పిలిపించింది.
అప్పుడు జ్ఞానాంబ మాట్లాడుతూ మీరిద్దరూ ఇప్పట్లో పిల్లలను వద్దనుకున్నారా అని ప్రశ్నించగా.. అప్పుడు రామచంద్ర అయ్యో అలాంటిది ఏమీ లేదమ్మా అని అంటారు. మరి అలాంటప్పుడు పెళ్లి అయ్యి ఇన్ని ఏళ్ళు అయినా కూడా మీకు ఎలాంటి విశేషం లేదు అంటే ఒకసారి వెళ్లి డాక్టరును కలవండి అని చెబుతుంది. నేను జానకి తీసుకొని ఆసుపత్రికి వెళ్తాను అని చెబుతుంది.
ఇంతలో నీలావతి మల్లికా అక్కడికి వస్తారు. నాటు వైద్యం గురించి చెప్పి నాటువైద్యం ని వాడమని జానకి సూచిస్తారు. అప్పుడు జానకి అత్తయ్య గారు నేను అలాంటివాటిని నమ్మను అని చెబుతుంది. అప్పుడు జ్ఞానాంబ ఏం కాదులే జానకి ఒకసారి నాటు మందులు కూడా వాడు, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకున్నాను అని చెబుతుంది.
ఇక ఆ తర్వాత జానకి, లీలావతి, మల్లికా ముగ్గురు కలసి నాటు మందులు తెచ్చుకోవడానికి వెళ్తారు.అక్కడ జానకికి పిల్లలు పుట్టకుండా ఉండటానికి నీలావతి, మల్లికా మందులు ఇస్తారు. అప్పుడు జానకి డౌట్ వచ్చి మందులు ఇచ్చే వ్యక్తిని ప్రశ్నించగా అతడు కాస్త తలపడతాడు.
మరొకవైపు జ్ఞానాంబ దంపతులు నిశ్చితార్థం ముహూర్తం గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి మల్లీక వచ్చి నేను మందులు తెచ్చుకున్నాను అని చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Janaki Kalaganaledu : ఆనందంలో జ్ఞానాంబ కుటుంబం.. టెన్షన్‌లో బాధపడుతున్న జానకి..?