...

Guppedantha Manasu: చావు బతుకుల మధ్యలో మహేంద్ర వర్మ.. తట్టుకోలేకపోతున్న రిషి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రిషి.. గౌతమ్ ను కాబిన్ లో ఉండమని చెప్పి వసుధార తో చిట్ చాట్ చేయడానికి ఒక చెట్టు దగ్గరికి వస్తాడు. చెట్టు కింద హాయిగా వసుతో కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ అక్కడికి వచ్చి ‘నన్ను క్యాబిన్ లో పెట్టి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్’ అని కోపంగా అడుగుతాడు.

మరోవైపు మహేంద్ర, దేవయానితో ఎటకారంగా మాట్లాడిన మాటల గురించి పెద్దగా నవ్వుకుంటూ ఆ విషయాలన్ని జగతికి చెప్పుకోస్తాడు. అలా నవ్వుకుంటూ ఉన్న మహేంద్ర ఒక్కసారిగా హార్ట్ పెయిన్ వచ్చినట్టుగా కింద పడిపోతాడు. దానికి భయంతో జగతి ఏడ్చుకుంటూ రెస్టారెంట్ లో పని చేస్తున్న వసుకు కాల్ చేస్తుంది. అదే క్రమంలో జగతి రిషికి కూడా కాల్ చేస్తుంది. కానీ రిషి ఆ టైంలో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటాడు. కాబట్టి కాల్ లిఫ్ట్ చేయలేకపోతాడు.

ఇక రెస్టారెంట్ నుంచి వసు ఇంటికి వస్తుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్ కు తీసుకుని వెళతారు. ఆ తర్వాత వసు, గౌతమ్ కు కాల్ చేసి జరిగిన విషయమంతా చెబుతుంది. ఇక గౌతమ్, రిషిను తీసుకుని కారులో బయలుదేరుతాడు. కానీ గౌతమ్ రిషికు జరిగిన సంగతి చెప్పడు. రిషి కి తెలియకుండా గౌతమ్ కంటతడి పెడతాడు. రిషికి చెప్పకుండా తీసుకెళుతున్న గౌతమ్, రిషి ఏం జరిగిందని ఎంత అడిగిన మౌనంగా ఉంటాడు.

మరోవైపు జగతి మహేంద్ర కు ఇలా జరిగినందుకు చాలా బాధపడుతుంది. వసుధార దగ్గరుండి ధైర్యం చెబుతుంది. జగతి, మహేంద్రకు ఏదైనా జరిగితే నేను బ్రతకను అన్నట్లు మాట్లాడుతుంది. తరువాయి భాగం లో రిషి హాస్పిటల్ కు రానే వస్తాడు. అలా వచ్చిన రిషి, వసును డాడ్ కు ఏమైంది అని అడుగుతాడు. వసుధార హాట్ స్ట్రోక్ అని చెప్పేసరికి.. అది విన్న రిషి గట్టిగా ఎమోషన ల్ గా ఏడుస్తాడు.

తర్వాత తన తండ్రి మహేంద్ర దగ్గరికి వెళ్లి, డాడ్ లేవండి.. మీకు ఇలా జరుగుతుంది అని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. అంటూ బాధపడతాడు రిషి. మరి ఈ క్రమంలో చావు బతుకు మధ్యలో ఉన్న మహేంద్ర గురించి డాక్టర్లు బయటికి వచ్చి ఏ వార్త చెబుతారో రేపటి భాగం లో చూడాల్సి ఉంది.