Komma Uyyala Full Video Song : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాలు టాలీవుడ్ టాప్ హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. భారీ బడ్జెట్ తో ఫాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ” కొమ్మ ఉయ్యాల కోన జంపాల” బాగా ఫేమస్ అయ్యింది.
ఈ సినిమాలో మల్లీ అనే చిన్నారి కొమ్మ ఉయ్యాల కోన జంపాల అంటూ మధురమైన గాత్రంతో పాట పాడుతూ తెల్ల దొరసానికి డిజైన్ వేస్తూ ఉంటుంది. చిన్నారి ప్రతిభ చూసి మంత్ర ముగ్ధురాలైన దొరసాని తిరిగి కోటకు వెళ్ళేటప్పుడు నిర్ధాక్షణ్యంగా చిన్నారిని తనతోపాటు లాక్కెళ్ళింది. ఈ సీన్ తో సినిమా ప్రారంభం అవుతుంది. ఈ పాట ప్రస్తుతం బాగా హిట్ అయింది. ఈ పాట మీద చాలామంది వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ పాటకు సంబంధించిన పూర్తి వీడియోనిఆర్ఆర్ఆర్ ఇటీవల విడుదల చేసింది. ఈ వీడియోలో చిన్నారి పాట పడిన తర్వాత దొరసాని తీసుకెళ్ళే దగ్గర నుండి చిన్నారిని జైలులో బందీగా చేసినది, చివరగా ఎన్టీఆర్ తనని భుజాలమీద ఎత్తుకుని తీసుకు వచ్చే వరకు అన్ని చూపించారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూ మంచి విజయాన్ని అందుకుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాట ఫుల్ వీడియో పై ఓ లుక్కేయండి.
Read Also : Ram Charan – Chiranjeevi: అస్సలు తగ్గను అంటూ తండ్రికే ఛాలెంజ్ విసిరిన రామ్ చరణ్..?