KGF2 : బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను 500 కోట్ల రూపాయలతో నిర్మాత డీవీవీ దానయ్య తెరకెక్కించారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ద్వారా తనకు 100 నుంచి 150 కోట్ల వ రకు లాభం వచ్చిందట. ఆర్ఆర్ఆర్ సినిమాలో వచ్చిన లాభాల్లో రాజమౌళికి కూడా లాభాలు ఉండడంతో దానయ్యకు అంతగా కలిసి రాలేదు.
కానీ కేజీఎఫ్ 2 సినిమాను మాత్రం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఏకంగా 550 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారట. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ మెత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. అయితే కేజీఎఫ్2 సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే.. నిర్మాతలు ఏకంగా మూడు రెట్ల లాభాలు రావడం గర్వించదగ్గ విషయం.
అయితే కేజీఎఫ్2 సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసినా ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తాయా లేదా అనే సందేహాలు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాను మించి హిట్ టాక్ వస్తే.. కేజీఎఫ్2 కచ్చితంగా కోట్లలో కలెక్షన్లు రాబడుతుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also : Pragya jaiswal: మెన్నటి వరకు పూజా హెగ్డే.. నేడు ప్రగ్యా.. నెటిజెన్ల చేతిలో అయిపోయారుగా!