RRR Nizam Collections : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు ముందు గర్జిస్తూ అడ్డొచ్చినా పాత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.900కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.330కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే తాజాగా నైజాంలోనూ సరికొత్త స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. రూ.100 కోట్ల షేర్ను అందుకుంది. నైజాంలో అంత మొత్తంలో కలెక్షన్లను కలెక్ట్ చేసిన తొలి సినిమాగా నిలిచింది. అయితే ఈ విషయాన్ని సినీ జర్నలిస్టు బీఏ రాజు సోషల్ మీడియా టీమ్ ట్వీట్ చేసింది. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్గా నటించి ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రను వేసుకున్నారు.