kGF-2 Mahabooba song: కన్నడ స్టార్ హీరో యశ్ నటించి కేజీఎఫ్ 2 బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల తుఫానుతో రాఖీ భాయ్ దూసుకుపోతున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా కేజీఎఫ్-2 నిలిచింది. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ బాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమాలోని పాటలకు ఒకటొకటిగా పాటల పూర్తి వీడియోలను చిత్రబృందం రిలీజ్ చేస్తోంది. అయితే మదర్స్ డే రోజు అమ్మ పాటు విడుదల చేయగా… తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. లవ్ ట్రాక్ లో సాగిన మెహబూబా పాటను ట్విట్టర్ వేదికగా వీడియో లింక్ ను షేర్ చేశారు. హోంబోలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా అలరించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.