...

Sreekanth Reddy: డబ్బుకోసమే కరాటే కళ్యాణి నా పై దాడి చేసింది.. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

Sreekanth Reddy: నటి కరాటే కళ్యాణి గురువారం సాయంత్రం యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి పై తన అనుచరులతో కలిసి దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కరాటే కళ్యాణి అతని పై దాడి చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే శ్రీకాంత్ రెడ్డి ఫ్రాంక్ వీడియోలు అంటూ రోడ్డుపై వెళ్లే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఉద్దేశంతో తనతో గొడవకు దిగి తనపై దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే పరస్పరం ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న అనంతరం ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తాజాగా కరాటే కళ్యాణి తనపై దాడి చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియోలో భాగంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నేను ఎలాంటి తప్పు చేయలేదు… నా వీడియోలో భాగంగా లేడి ఆర్టిస్టులు వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు. కరాటే కళ్యాణి కూడా సినిమాలలో అలాగే చేస్తుంది. కానీ నిన్న రాత్రి నా ఇంటి వద్దకు వచ్చి నన్ను బయటికి రమ్మని గట్టిగా అరిచారు. ఇలా తను బయటకు రాగానే కరాటే కళ్యాణి తనకు లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేశారు.

తనతో పాటు మరొక వ్యక్తి కూడా నన్ను తిట్టడం మొదలు పెట్టారు. ఇలా డబ్బులు అడగడంతో నేను ఎందుకు మీకు ఇవ్వాలని ప్రశ్నించాను. అంతటితో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. తనతో పాటు వచ్చిన మరొక వ్యక్తి గొడవెందుకు 70 వేలకు సెట్ చేస్తాను అని అన్నారు. ఇలా వాళ్లు నన్ను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసినప్పటికీ నేను డబ్బు ఇవ్వనని చెప్పడంతో నా పై దాడి చేసి నా చొక్కా మొత్తం చెప్పారు.ఈ విషయంలో మీరు సపోర్ట్ నాకు కావాలి ఇందులో నా తప్పు లేదు అంటూ శ్రీకాంత్ రెడ్డి వీడియో ద్వారా వెల్లడించారు. అయితే ఈ విషయంపై కరాటే కళ్యాణి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అందుకే తనతో గొడవ పడ్డారని వెల్లడించారు.