...

Namita: పుట్టినరోజు సందర్భంగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన నమిత.. ఫోటోలు వైరల్!

Namita: సొంతం, జెమిని, బిల్లా, సింహ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన నటి నమిత. తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళం వంటి పలు భాషల సినిమాలలో నటించిన ఈ అమ్మడు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బుల్లితెర మీద కూడా సందడి చేసింది. ఈ సమయంలో నమిత అధిక బరువు పెరగటంతో సినిమా ఆఫర్లు కూడ తగ్గాయి. అందువల్ల నిరాశ చెందిన నమిత 3 నెలల్లో 20 కేజీల బరువు తగ్గింది. ఇక 2017 వ సంవత్సరంలో సహనటుడు వీరేంద్ర చౌదరి ని నమిత వివాహం చేసుకుంది.
అయితే మే 10 వ తేదీ తన పుట్టిన రోజు సందర్భంగా నమిత తన అభిమానులకి శుభవార్త చెప్పింది.

Advertisement

పుట్టినరోజు ఈ సందర్భంగా బేబీ పంపు తో ఉన్న ఫోటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. పెళ్లి అయిన ప్రతి స్త్రీ మాతృత్వం కోసం ఎంతో ఆరాట పడుతుంది. పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ డ్రెస్లో బేబీ పంపు తో ఉన్న ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన నమిత కాబోయే తల్లిగా తన మనసులోని భావాలను రాసి క్యాప్షన్ పెట్టింది

Advertisement

ట్విట్టర్ ద్వారా బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ..” నా జీవితంలో అమ్మగా కొత్త అధ్యయనం మొదలయ్యింది.ఇన్ని రోజులుగా నీ రాకకోసం ఎన్నో ప్రార్థనలు చేసి నీకోసం ఎదురు చూసా. ఇన్ని రోజులకు నా కల నెరవేరింది కడుపులో నీ కదలికలు నన్ను ఎంతో ఆనందపెడుతున్నాయి. నీ రాక మునుపెన్నడు లేని సంతోషం, ఆనందమైన మధురానుభూతులను నాకు కలిగిస్తున్నాయి” . అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్ల తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా నమిత కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Advertisement
Advertisement