Computers short cuts: చాలా మందికి కంప్యూటర్ పరిచయమే ఉంటుంది. చదువుకున్న వారికి కంప్యూటర్ వాడకం తెలిసే ఉంటుంది. అలాగే చదువుకోని వారికి కూడా కంప్యూటర్ గురించి తెలుస్తుంది. అయితే కంప్యూటర్ ను ఎప్పుడూ ఉపయోగించే వారికి కూడా ఈ విషయం తెలియకపోవచ్చు. అదే F కీస్ గురించి. ప్రతి కంప్యూటర్ కీబోర్డుపై F1 నుండి F12 వరకు కీస్ గమనించే ఉంటారు. కానీ వాటి ఉపయోగం ఏమిటో చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. F కీస్ ను ఫంక్షన్ కీస్ అని అంటారు. F1 నుండి F12 వరకు ఉండే ఈ బటన్లను ఉపయోగిస్తే పని చాలా సులువుగా పూర్తి అవుతుంది. కంప్యూటర్ లో పలు పనులు చేసే సమయంలో వీటిని ఉపయోగిస్తే చేసే పని ఫాస్ట్ గా అవుతుంది. రెండు, మూడు బటన్లను నొక్కితే కానీ జరగని పనిని కూడా ఒక్క F కీ వాడితే సరిపోతుంది. టచ్ స్క్రీన్, మౌస్ వాడకం చాలా వరకు తగ్గుతుంది.
విండోస్లో F1 ప్రెస్ చెయ్యగానే హెల్ప్ మెన్యూ ఓపెన్ అవుతుంది. అదే ఎక్సెల్. విండోస్ ఎక్స్టెరర్లో అయితే F2 కీసాయంతో ఫోల్డర్ లేదా ఫైల్ రీనేమ్ చేయొచ్చ. F3 ఫంక్షన్ ని సెర్చ్ ఫంక్షన్ చేయడానికి ఈ కీని ఉపయోగిస్తారు. F4కీని ప్రెస్ చేయడం ద్వారా ఓపెన్ చేసిన విండోలతో పాటు కంప్యూటర్ ని కూడా షట్ డౌన్ చేయవచ్చ. వెబ్ బ్రౌజర్ను అప్ డేట్ లేదా రీఫ్రెష్ చెయ్యాలంటే F5నిప్రెస్ చేయాలి. F6 ప్రెస్ చెయ్యడం ద్వారా మ్యాక్ కీ బోర్డ్ లైటింగ్ పెంచుకోవచ్చు. అలాగే మ్యాక్ వర్డ్ డాక్యుమెంట్లు ఒకటి కన్నా ఎక్కువ ఓపెన్ చేసినప్పుడు ఒక దాన్నుంచి మరో దానికి మారేందుకు కూడా F6ని షార్ట్ కట్ పయోగించవచ్చు. యాపిల్ యూజర్స్ ఐ ట్యూన్స్ అంతకు ముందు పాట వినాలనుకుంటే జస్ట్ F7 ప్రెస్ చెయ్యండి సరిపోతుంది. విండోస్ లో F8 ప్రెస్ చేస్తే వెంటనే సేఫ్ మోడ్ ఎనేబుల్ అయిపోతుంది. F9 కీ ప్రెస్ చేస్తే… ఐ ట్యూన్స్ నెక్స్ట్ సాంగ్ వెళ్లవచ్చ. యాపిల్ సిస్టమ్ లో ఆడియో టర్న్ ఆన్ లేదా టర్నాఫ్ చేయడానికి F10 కీని ప్రెస్ చేస్తాం. F11 పీసీలో తక్షణం ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్లాలంటే సింపుల్ షార్ట్ కట్ జస్ట్ ప్రెస్ F11 అంతే.విండోస్ సిస్టమ్లో వర్డ్ ఉపయోగిస్తున్నప్పుడు సేవ్ యాజ్ ఫంక్షన్ ఓపెన్ చెయ్యడానికి షార్ట్ కట్ F12.