Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఎపిసోడ్ ప్రారంభంలోనే పాత విషయాలు మనసులో పెట్టుకొని గొడవ పడ్డాను అని రామ కవర్ చేసుకుంటాడు. ఇక జ్ఞానాంబ నిజానికి పాత గొడవలే కారణమా? అని అడుగుతుంది. రామచంద్ర అవునమ్మా అని తన తల్లిని నమ్మిస్తాడు. మరోవైపు మల్లికకు కన్నబాబు కనపడతాడు.
కన్నబాబు కాఫీ కేఫ్ లో టీ తాగుతూ ఉండగా.. అక్కడకు మల్లిక వెళ్లి చాయ్ తాగుతూ ఉంటుంది. ఇక నిన్ను ఒకటి అడగాలి అని కన్న బాబు అడగగా ఇక కన్నబాబు మల్లిక పై చిరాకు పడుతూ ఉంటాడు. మరోవైపు రామచంద్ర తన తల్లితో భోజనం చేస్తూ ఉండగా.. ఈ క్రమంలో కన్నబాబు అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక రామచంద్ర నేను మోసపోయాను అమ్మ.. నువ్వు స్వీట్ షాప్ విషయం లో నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయాను అని మనసులో అనుకుంటాడు. అన్నం తినకుండా చేతిని కడిగేసుకుంటాడు. అన్నం తినకుండా బయటకు వెళ్లిన రామచంద్ర చీకట్లో కట్టెలు కొడుతూ ఉంటాడు.
అది గమనించిన జ్ఞానాంబ ఇలా చేస్తున్నాడు ఏంటి? అని ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో జ్ఞానాంబ జానకి దగ్గరకు వెళ్లి నా కొడుకు ఎక్కడ అని అడుగుతుంది. అంతేకాకుండా ఈ టైంలో వాడు బయట ఎందుకు ఉన్నాడో.. అసలు వాడు మనసు ఏమిటో? నీకు తెలుసా అని జానకి పై విరుచుకు పడుతుంది.
తన మనసులో కష్టాన్ని భరించలేక ఎవరికీ చెప్పుకోలేక.. అంత రాత్రి పిచ్చోడిలా కట్టెలు కొడుతున్నాడు అని జానకి పై కోపడుతుంది. అంతేకాకుండా జ్ఞానాంబ ఆ బాధకు కారణం కూడా నువ్వే అని జానకిని ను నిందిస్తుంది. అగ్నిపర్వతం అంత దుఃఖం ను మోయడానికి కారణం ఏమిటో నీకు తెలియదా అని అడుగుతుంది.
ఇక నా బిడ్డ అలా కుమిలి పోతూ ఉంటే ఈ అమ్మ పేగు తరుక్కుపోతుంది అని చెబుతుంది. అదే క్రమంలో జ్ఞానాంబ తన అన్నయ్య అన్న మాటలు గురించి జానకిను దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఇక జ్ఞానాంబ మాటలకు జానకి బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎందుకు ఎలా ఉన్నారు అని రామ చంద్రను అడుగుతుంది.
ఇక రేపటి భాగంలో జానకి ను పోలీసులు తీసుకొని వెళతారు అని మల్లిక జ్ఞానంబకు చెబుతుంది. ఇది నిజమేనా జానకి అని జ్ఞానాంబ అడగగా.. అదీ అత్తయ్య గారు అని మాట వెనకేస్తుంది. ఇక జ్ఞానాంబ కన్న బాబు గొడవ గురించి జానకి ను అడుగుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World