Karthika Deepam Serial : మోనిత కన్నీటికి కరిగిపోయిన డాక్టర్ బాబు.. ట్విస్ట్ ఏంటంటే?

karthika-deepam-2021-february-19-episode-preview
karthika-deepam-2021-february-19-episode-preview

Karthika Deepam Serial Today Episode Feb 19: కార్తీక దీపం సీరియల్​ రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. నిన్న జరిగిన ఎపిసోడ్​కు కొనసాగింపుగా.. దీప చెప్పేది కూడా నీ మంచికే కదరా? మోనితని నమ్మడానికి లేదు అనే కదా దాని భయం అంటూ సౌందర్య సద్ది చెబుతుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్‌కి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి మోనితా చెప్పు అంటాడు. ఆనందరావు, సౌందర్య, ఆదిత్యలు షాక్ అయిపోతారు. కార్తీక్ మా బాబాయ్ ఆపరేషన్.. అంటూ నసుగుతుంది మోనిత. చెప్పాను కదా.. నేను మీ బాబాయ్‌కి ఆపరేషన్ చెస్తాను.. మరి నీ సంగతి ఏంటి.. ఇచ్చిన మాట మీద నిలబడతావా? అంటాడు కార్తీక్ ఆవేశంగా స్పీకర్ ఆన్ చేస్తాడు.. అయ్యో కార్తీక్ నన్ను ఇంక నమ్మవా.. నిజంగానే నేను మాట మీద నిలబడతాను’ అంటుంది మోనిత. అప్పుడు మోనిత మాటలన్నీ అందరూ వింటారు.

karthika-deepam-2021-february-19-episode-preview
karthika-deepam-2021-february-19-episode-preview

మరోవైపు కార్తీక్ ఆసుపత్రికి బయలుదేరుతుంటే.. సౌందర్య అడ్డుపడుతుంది. ‘కార్తీక్ దీప ఎప్పుడు కరెక్ట్‌గానే ఆలోచిస్తుందిరా.. ఒకసారి మోనిత విషయంలో జాగ్రత్తగా ఆలోచించరా’ అంటుంది. ‘ఎప్పుడు నెగటివ్‌గా ఎందుకు ఆలోచించాలి మమ్మీ? నాకు ఈ లైసెన్స్ రావడంలో మోనిత పాత్ర ఉంది కదా.. తన మారి ఉండొచ్చు కదా?’ అంటాడు కోపంగా.. ‘బాగా గుర్తు చేసుకోరా.. దోషనివారణా పూజ కోసం నా పట్టుదలపై వచ్చినా దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుని ఆ మోనిత ఫొటోస్ తీయించి పెట్టుకుంది ఆ మోనిత. అసలు ఆ దోషనివారణ అనేదే ఓ కుట్ర అని దీపే నిరూపించింది. కార్తీక్ మంచితనం మన ఫ్యామిలీకి చాలా చెడు చేసిన విషయం మరిచిపోవద్దు..’ అంటుంది సౌందర్య. దాంతో కార్తీక్ సౌందర్య మాటలని తలుచుకుంటూనే ఆసుపత్రికి బయలుదేరతాడు.

Advertisement

Karthika Deepam Serial Today Episode Feb 19 : మోనిత కన్నీరు.. డాక్టర్ బాబు ఏం చేశాడంటే? 

ఇక కార్తీక్ ఆసుపత్రిలో మోనిత ఓ నర్స్‌కి తన గురించి ప్లాన్ చెబుతుంది. తీరా ప్లాన్ అంతా విన్నాక ఆ నర్స్.. ‘సారీ మేడమ్.. నేను చెయ్యను.. మీకు ఇష్టమైతే మీ బాబాయ్‌కి ఆపరేషన్ చేయించండి లేకపోతే లేదు..’ అని వెళ్లిపోబోతుంది. సరిగ్గా అప్పుడే కారీక్ వాళ్లని చూసి..  ‘ఏంటి మోనితా తనతో ఏం మాట్లాడుతున్నావ్?’ అంటాడు కార్తీక్? ‘ఏం లేదు కార్తీక్ ఏదో పేషెంట్ మందులు గురించి చెబితే అవి మార్చమని చెప్పానంతే..’ అంటుంది మోనిత.

మరోవైపు సౌందర్య..  మోనిత ఇంటి ముందు కుర్చీలో కూర్చుని  మోనిత బాబాయ్ ఇంట్లోంచి బయటికి రాగానే..  ‘మా అబ్బాయి డాక్టర్ కార్తీక్ ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేశాడు.. ఎందరో ప్రాణాలు నిలబెట్టాడు..’ అని సౌందర్య గొప్పగా చెప్తుంది.  ‘ఇచ్చిన మాట ప్రకారం.. మీకు ఆపరేషన్ చేస్తారు మీరు తప్పక బాగు అవుతారు.. మీకు ఆపరేషన్ అవ్వగానే మోనితని తీసుకుని అమెరికా వెళ్లిపోండి..’ అంటుంది సౌందర్య  అయితే ఆ మాటలు అప్పుడే వచ్చిన మోనిత వినేస్తుంది. ఇప్పుడు.. దానికి ఎదురు తిరుగుతుందో.. లేక ఆపరేషన్ జరగాలి కాబట్టి సైలెంట్​గా ఉండిపోతుందే.. తెలియాలంటే.. కార్తీక దీపం తరువాయి భాగం చూడాల్సిందే..

Advertisement

Read Also : Karthika deepam: మోనితకు దిమ్మతిరిగే షాక్‌… రీఎంట్రీ ఇచ్చిన కార్తీక్‌ లవర్‌ హిమ..!

Advertisement