...

Kakarakaya Curry : ఇలా చేస్తే కాకరకాయ అస్సలే చేదుగా ఉండదు.. మీరూ ఓసారి ట్రై చేయండి మరి!

Kakarakaya Curry : కాకరకాయ.. కొంత మందికి ఈ కూర అంటే చాలా ఇష్టం. మరికొంత మందికి అస్సలే నచ్చదు. నచ్చకపోవడానికి కారణం చేదుగా ఉండటమే. కానీ వండాల్సిన రీతిలో వండితే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అస్సలే చేదుగా అనిపించదు. అయితే కమ్మగా ఉండే ఈ కాకరకాయ పులుసును ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు.. పావుకిలో కాకరకాయలు, ఒక కప్పు ఉల్లి గడ్డలు, 30 గ్రాముల చింతపండు, అరకప్పు కరివేపాకు, రెండు పచ్చి మర్చి, రెండు టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి, ఒక టేబుల్ స్పూన్ దనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ చక్కెర.

Kakarakaya Curry : తయారీ విధానం..

ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఒక బౌల్ లో తీస్కొని పసుపు, ఉప్పు వేసి కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కాకరకాయ ముక్కలను గట్టిగా నొక్కడం వల్ల అందులో ఉన్న రసం అంతా పోయి చేదు పోతుంది. ముందుగా గ్యాస్ పై ఓ పెనం పెట్టుకొని అందులో కాస్త నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్దు, పసుపు కూడా వేసి కలుపుకోవాలి. అనంతరం కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలపాలి.

ఆ తర్వాత ఒక పదినిషాలు మంటను సిమ్ లో పెట్టి మూత పెట్టేయాలి. అది కొంచెం దగ్గరగా వచ్చాక కారం, ఉప్పు, నువ్వులు, దనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం, చక్కెర వేసుకొని మరిగించుకోవాలి. కావాల్సినంత దగ్గర పడే వరకు మరగనిచ్చి ఆ తర్వాత దింపేయడమే. ఇంకెందుకు ఆలస్యం కమ్మ కమ్మగా ఉండే కాకరకాయను మీరూ ట్రై చేయండి.

Read Also : Potato 65 : ఆలూ 65 ఎప్పుడైనా ట్రై చేశారా? ఎంతో టెస్టీగా కరకరలాడుతూ భలే ఉంటాయి.. ఇలా చేయండి..