Potato 65 : ఆలుతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఆలుతో చేసిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ప్రత్యేకించి చిన్న పిల్లలు ఎక్కువగా ఆలూతో చేసిన చిప్స్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. పిల్లలకు బయట దొరికే చిప్స్ మంచిది కాదు.. అందుకే ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంతో హెల్తీ స్నాక్స్ తినవచ్చు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ ఆరోగ్యకరమైన ఆలూ 65 స్నాక్స్ తినవచ్చు. ఇంతకీ ఆలూ 65 స్నాక్స్ ఎలా తయారు చేయాలో తెలుసా? కరకరలాడే ఎంతో రుచికరమైన ఆలూ 65 తయారుచేసే విధానాన్ని ఒకసారి చూద్దాం..
ముందుగా మీరు ఆలుగడ్డలను అరకేజీ తీసుకోవాలి. గ్యాస్ పై ప్యాన్ పెట్టి అందులో నీళ్లు పోయాలి. ఆ తర్వాత అందులో అర చెంచాడు ఉప్పు వేయాలి. ఆ నీళ్లలో ఆలుగడ్డలను వేసి బాగా ఉడికించుకోవాలి. అది కూడా ఆలుపై తొక్క ఉండేంతవరకు మాత్రమే ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉంటే బాగోదు.. ఉడికించిన బంగాళదుంపలను చల్లారిన తర్వాత పై తొక్కను తీసివేయాలి. ఆ తర్వాత మీకు కావాల్సినంత సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకోవాలి.
అలాగే 2 టేబుల్ స్సూన్ల బియ్యం పిండి కూడా తీసుకోవాలి. అలాగే మరో రెండు స్పూన్ల మొక్కజోన్న పిండిని తీసుకోవాలి. ఒక టీస్పూన్ కారం పొడిని వేయాలి. 3/4 టీ స్పూన్ల ఉప్పును రుచికి తగినంతగా కలపాలి. ఒక టీస్పీన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడిని వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లను కలుపుకుంటూ ఆ పిండిని పకోడి పిండి మాదిరిగా కలుపుకోవాలి. నీళ్లనీళ్లగా ఉండకూడదు. అలా అని గట్టిగా ఉండకూడదు..
Potato 65 : ఆలూ 65 తయారీ విధానం..
ఇప్పుడు ఒక అరచెంచా పసుపును ఆ మిశ్రమంలో కలపాలి. ఇప్పటికే ముక్కలుగా కట్ చేసిన ఉడికించిన బంగాళదుంప ముక్కలను ఆ మిశ్రమంలో వేయాలి. చేతులతో బాగా కలపాలి. పిండి బాగా పట్టేలా కలుపుకోవాలి. చూడటానికి అచ్చం బజ్జి పిండిలానే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేయాలి. పిండి పట్టించిన ఆలూ ముక్కలు మునిగేలా నూనె ఉండాలి. నూనె వేడిక్కిన తర్వాత కోట్ చేసిన ఆలు ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
స్టవ్ లో ప్లేమ్ అండ్ మీడియం ప్లేమ్ లో ఉంచి ఆలు ముక్కలను గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. అలా డీప్ ప్రై చేసిన ఆలూ ముక్కలను తీసి ఒక బౌల్ లో వేసుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని దోరగా వేయించుకోవాలి. రెండు ఎండుమిర్చి వేసిన నిమిషం తర్వాత కొద్దిగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెబ్బలను తగినంత వేసుకోవాలి. అర కప్పు పెరుగును కూడా అందులో కలపాలి.
చిటికెడ్ ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. టేస్టుకు తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఒక నిమిషం పాటు అలానే ఉంచుకోవాలి. చివరగా.. వేయించుకున్న ఆలు ముక్కలను ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఆలూ 65 స్నాక్స్ రెడీ అయినట్టే.. మీరు, మీ పిల్లలు రుచికరమైన ఆలూ 65 స్నాక్స్ ఇష్టంగా తినవచ్చు. మీరూ కూడా ఓసారి ట్రై చేయండి..
Read Also : Tomato Pappu : టమాటా పప్పు ఒక్కసారి ఇలా చేస్తే.. ప్లేటు ఖాళీ కావడం ఖాయం?