Karthika Deepam Nov 4 Today Episode : మోనితకు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన దీప.. సౌర్య దగ్గరికి వెళ్లిన ఆనందరావు, హిమ..?

deepa warns to monitha karthika deepam serial episode
deepa warns to monitha karthika deepam serial episode

Karthika Deepam Nov 4 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప, చంద్రమ్మ అన్నమాట తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో పదేపదే చంద్రమ్మ అన్న మాటలు తలుచుకొని కుమిలిపోతూ ఉండగా దుర్గ ధైర్యం చెబుతూ ఉంటాడు. నాకు ఎందుకో ఆవిడ ప్రవర్తన అనుమానంగా ఉంది దుర్గ తప్పు చేసిన వాళ్ళే ఆ విధంగా భయపడతారు ఆవిడ తడబడుతోంది కోపగించుకుంటుంది అని అంటుంది దీప. అప్పుడు దుర్గ సౌర్యం అక్కడే ఉంది అన్నదానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా దీపమ్మ అని అడగగా ఆధారాలు ఉంటే ఇలా ఒట్టి చేతులతో వచ్చే దాన్ని కాదు దుర్గ అని అంటుంది.

Advertisement
Karthika Deepam Nov 4 Today Episode
Karthika Deepam Nov 4 Today Episode

అప్పుడుగా ఇప్పుడు సౌర్య గురించి ఎక్కువగా ఆలోచించకుండా కార్తీక్ బాబు గురించి ఆలోచించి దీపమ్మ అని ధైర్యం చెబుతాడు. మరొకవైపు కార్తీక్,మోనిత ఇద్దరూ మోనిత కారు దగ్గరికి వెళ్తారు. అప్పుడు అక్కడ మెకానిక్ లేకపోయేసరికి కార్తీక్ మెకానిక్ ఎక్కడ మోనిత అని అనగా వచ్చి రిపేర్ చేసి వెళ్లిపోయాడు అనడంతో కార్తీక్ అనుమాన పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. నీ మాటలు నాకెందుకు నమ్మాలి అనిపించడం లేదు అని అంటే అడుగు కార్తీక్. అప్పుడు కార్తీక్ నువ్వు కావాలనే కారు చెడిపోకపోయినా కారు చెడిపోయింది అని చెప్పి ఆటోలో వచ్చావేమో ఆ ఆటో అతని నీకు తెలిసేమో అనటంతో మధ్యలో ఈ ఆటో వాడి గోల ఏంటి కార్తీక్ అంటుంది మోనిత.

ఆ తర్వాత మోనిత మాట్లాడుతుండగా కార్తిక్ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మా ఆ తరువాత మోనిత కార్తీక్ అన్న మాటలు తలుచుకొని దీనంతటికీ కారణం దీపనే దాని సంగతి తేల్చేయాలి అని వెళ్లి దీప ఇంటి తలుపులు కాలితో తంతుంది. అప్పుడు మోనిత నాకున్న ఏకైక శత్రువు నువ్వే నీ పీడ వదిలించుకోవాలి ఏం చేయాలి సిగ్గులేకుండా నా భర్త వెనుక నువ్వు పడుతున్నావు అనడంతో వెంటనే దీప స్వీట్ గా వార్నింగ్ ఇస్తూ నువ్వే నా మొగుని వెంటపడుతున్నావు సిగ్గులేకుండా అక్రమంగా పిల్లలను కన్నావు అని అంటుంది.

Advertisement

Karthika Deepam నవంబర్ 4 ఎపిసోడ్ : దీప ఎమోషనల్… 

నిన్ను చంపేయాలి అని మోనిత అనగా,నేను కూడా అదే ఆలోచన అనుకుంటే నువ్వు రెండు నిమిషాల్లో వెళ్ళిపోతావు దుర్గ కూడా రెడీగా ఉన్నాడు అని అంటుంది దీప. ఆ తర్వాత మోనిత కోపంగా మాట్లాడుతూ ఉండగా దీప వీటిలో వార్నింగ్ ఇవ్వడంతో మోనిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు చంద్రమ్మ ఇంద్రుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా అయినా ఈ ఊరు విడిచి ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి అని సౌర్యమ్మ నీ వాళ్ళ అమ్మానాన్నలకు కనపడకుండా దూరంగా తీసుకుపోవాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.

కానీ సౌర్యమ్మ ఒప్పుకోదు కదా అని ఇంద్రుడు అనగా ఎలా అయినా ఒప్పించాలి గండా అని అంటుంది చంద్రమ్మ. ఇంతలోనే అక్కడికి ఆనంద్ రావు శౌర్య వస్తారు. మరొకవైపు దీప పదేపదే చంద్రమ్మ అన్నమాట తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో దుర్గ అక్కడికి వచ్చి నువ్వు ఏ విషయం గురించి బాధపడుతున్నావో నాకు అర్థమైంది దీపమ్మ ఇప్పుడే వెళ్లి వాళ్ళ సంగతి ఏంటో తేల్చుకుని వస్తాను అని కోపంగా బయలుదేరుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు.

Advertisement

ఏమైంది దుర్గ గారు ఎందుకు అంత ఆవేశంగా పెడుతున్నారు అనటంతో దుర్గా జరిగింది మొత్తం వివరించి వారి దగ్గరికి ఆవేశంగా వెళుతూ ఉండగా కార్తీక్ వద్ద దుర్గ గారు ఈ సమయంలో వెళ్లడం మంచిది కాదు రేపు ఉదయాన్నే నేను వంటలక్క వెళ్తాము అని దుర్గకి సర్ది చెబుతాడు. అప్పుడు దుర్గ సరే అనే అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో వెంటనే కార్తీక్ దీప తో మాట్లాడుతూ వంట ఏం చేశావు వంటలక్క అని అనగా ఏం చేయలేదు అని అనటంతో తొందరగా వెళ్లి వంట సంగతి చూడు అని అంటాడు కార్తీక్.

ఆ తర్వాత మోనిత కార్తీక్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని కార్తీక్ లో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు ఆనందరావు,హిమ మన ఇంటికి వెళ్దాం సౌర్య అని అనగా నేను రాను మీరు వెళ్ళండి అయినా ఇల్లు మారాం కదా అయినా ఎలా ఇక్కడికి వచ్చారు అని అంటుంది. అమ్మ నాన్నలు ఇక్కడే ఉన్నారు నాకు అనిపిస్తోంది నేను రాను మీరు వెళ్ళండి అని ఆనంద్ రావు ని కసరుకుంటుంది.

Advertisement

Read Also : Karthika Deepam: ఇంద్రుడు దంపతుల పై మండిపడిన సౌర్య..మోనితకు వార్నింగ్ ఇచ్చిన దీప..?

Advertisement