...

Kajal agarwal: చిన్న చిన్న విషయాలే ఆనందాన్ని ఇస్తాయంటూ కాజల్ పోస్ట్..!

Kajal agarwal: చందమామ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. అయితే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుందీ అమ్మడు. ఇకపోతే ఏప్రిల్ 19వ తేదీన ఓ పండంటి బాబుకి జన్మను కూడా ఇచ్చింది. ఈ బాబుకు నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టారు. కొడుకు పుట్టినప్పటి నుంచి కాజల్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. తన కుమారుడికి సంబంధించిన పోస్టులు పెడ్తూ.. అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక ఈ విధంగా తల్లిగా తన కొడుకు పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్న కాజల్ అగర్వాల్ నిత్యం నీల్ కు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని పోస్టు చేస్తుంది. తాజాగా తన కొడుకు మొహం కనిపించకుండా ఉన్న ఒక ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫొటోని కాజల్ అగర్వాల్ షేర్ చేస్తూ… చిన్న చిన్న విషయాలే చాలా ఆనందాన్ని ఇస్తాయంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.