...

Vastu Tips : ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే బీరువా తప్పనిసరిగా ఈ దిశలో ఉండాల్సిందే!

Vastu Tips: సాధారణంగా మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే మనం ఎన్నో రకాల వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటాము. ఇలా వాస్తు చిట్కాలు పాటించే సమయంలో కొందరు ఇంట్లో బీరువాను ఉత్తర దిశలో ఉండాలని, మరికొందరు నైరుతి దిశలో ఉండటం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తుంటారు. నిజానికి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మన ఇంట్లో బీరువా ఏ దిశలో ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం…

వాస్తు శాస్త్రం ప్రకారం ఒక గదిలో బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏ దిశలో ఉండాలి అనే విషయాలను గురించి మన పెద్దవారు చెబుతుండడం మన వింటున్నాము. ఈ క్రమంలోనే కొందరు ఇంటి నైరుతి భాగంలో బీరువా ఉండటం వల్ల అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు.

Read Also : Vastu Tips: తులసి మొక్కను ఈ దిశలో కనుక నాటితే కష్టాలు మీవెంటే..!

నిజానికి నైరుతి భాగంలో బీరువా ఎప్పటికీ ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.కనుక బీరువాని ఎల్లప్పుడు ఉత్తర వాయువ్య దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే వాయువ్య దిశ చంద్రుడికి అనుకూలం. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి కనుక మన ఇంట్లో విలువైన వస్తువులు అంటే డబ్బులు నగలు ఎల్లప్పుడూ కూడా ఉత్తర వాయువ్య దిశలో ఉంచాలి అంటే మనం బీరువా తెరచినప్పుడు ఉత్తర దిశవైపు ఉండేలా చూసుకోవాలి.ఇక బట్టలు వంటి వస్తువులను పెట్టుకునే బీరువాను నైరుతి దిశలో ఉన్నా కూడా ఏ విధమైన ఎటువంటి సమస్య ఉండదు. కానీ మనకు లక్ష్మీదేవి కటాక్షం ధన ప్రవాహం కలగాలంటే తప్పనిసరిగా బీరువా ఉత్తర వాయువ్య దిశలో ఉంచాలి.

Read Also : Devotional Tips: శని ప్రభావం మన ఇంటి పై ఉండకూడదు అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క ఉండాల్సిందే!