Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారంకు మనం కుంకుమను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి పూజా కార్యక్రమాలలో తప్పనిసరిగా పసుపుకుంకుమలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక పోతే ఓ మహిళ దీర్ఘ సుమంగళిగా ఉన్నంతకాలం నుదుటిన కుంకుమ ధరిస్తుంది. ఈ విధంగా ఎంతో పవిత్రమైన ఈ కుంకుమ కొన్నిసార్లు నేలపై పడిపోతుంది. ఇలా నేలపై కుంకుమ పడినప్పుడు చాలామంది ఏదో కీడు జరుగుతుందని చాలా మదన పడుతుంటారు. అయితే ఇలా కుంకుమ నేలపై పడడం అశుభం కాదని అది శుభపరిణామమని పండితులు తెలియజేస్తున్నారు.
కుంకుమ నేలపై పడటం అంటే సాక్షాత్తు ఆ భూదేవి కూడా తనకు కుంకుమ కావాలని మనల్ని అడిగినట్లు అర్థం.మనం ఏదైనా శుభకార్యాలు చేస్తున్న సమయంలోనూ లేదా ప్రయాణాలు చేస్తున్న సమయంలోనూ పసుపు కుంకుమలు నేల పై పడితే చాలామంది మనం చేసే పనిలో ఏదో ఆటంకం కలుగుతుందని మదన పడుతుంటారు. నిజానికి ఇలా ఏదైనా శుభకార్యం జరిగే సమయంలో పసుపు కుంకుమలు నేలపై పడితే ఆ శుభకార్యానికి మనం సాక్షాత్తు భూమాతను కూడా ఆహ్వానించినట్లు.
అందుకే పసుపు కుంకుమ నేల పై పడితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భూదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుందని అర్థం. మన ఇంట్లో జరిగే శుభ కార్యానికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమని ఏ విధంగా ఇస్తామో భూమాతకి కూడా అలాగే ఇచ్చినట్లు అని అందుకే ఎవరూ కూడా దాని గురించి ఆలోచించాల్సిన పనిలేదని పండితులు తెలియజేస్తున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World