Navagraha Dosham: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం పై జ్యోతిషశాస్త్ర ప్రభావం ఎంతగానో ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాల అనుకూలంగా ఉండటం వల్ల మనం ఎలాంటి పనులు చేసిన ఎంతో అదృష్టం వరిస్తుంది అలాగే గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహదోషాలు ఉన్న ఏలాంటి పనులు చేపట్టాలని ప్రయత్నం చేసిన విజయవంతం కాలేక సతమతమవుతూ ఉంటారు. ఇలా నవగ్రహదోషాలతో బాధపడేవారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.మరి నవగ్రహ దోషాలతో బాధపడేవారు దోష పరిహారం చేయడానికి నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే దోష ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సూర్యుడు: సూర్య దోషం ఉన్న వాళ్ళు నీటిలోఎర్రని పుష్పాలు యాలకులు కాస్త కుంకుమ పువ్వు వేసి స్నానం చేయడం వల్ల సూర్య గ్రహ దోష ప్రభావం తొలగిపోతుంది.
చంద్రుడు: ఈ దోషంతో బాధపడేవారు నీటిలో తెల్లటి పుష్పాలను, తెల్లటి గంధం, రోజ్ వాటర్ లేదా శంఖములో నీటిని నింపి ఆ నీటితో స్నానం చేయటం వల్ల చంద్ర గ్రహ దోషం తొలగిపోతుంది.
అంగారకుడు: ఈ గ్రహ దోషంతో బాధపడేవారు నీటిలో ఎర్రచందనం బెరడు, బెల్లం కలిపి స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
బుధ గ్రహం: బుధ గ్రహ దోషం తొలగిపోవాలంటే నీటిలో బియ్యం, జాజికాయ, తేనె కలిపి స్నానం చేయడం వల్ల బుధ గ్రహ దోషం తొలగిపోతుంది.
బృహస్పతి: నీటిలో ఆవాలు, పసుపు, మల్లెపువ్వులు, తమలపాకులను కలిపి స్నానం చేయడం వల్ల గురు గ్రహ దోషం తొలగిపోతుంది.
శుక్ర గ్రహం: శుక్ర గ్రహంతో బాధపడేవారు నీటిలో యాలకులు, తెల్లని పుష్పాలు, రోజ్ వాటర్ వేసి స్నానం చేయడం వల్ల ఈ దోషం తొలగిపోతుంది.
శని గ్రహం: శని దోషంతో బాధపడేవారు నీటిలో నల్ల నువ్వులు, సోంపు, సుగంధ ద్రవ్యాలు కలిపి కూడా స్నానం చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది.
రాహు దోషం: రాహు దోషంతో సతమతమయ్యేవారు నీటిలో సంపు సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానం చేయడం వల్ల ఈ దోషం తొలగిపోతుంది.
కేతు దోషం: సుగంధ ద్రవ్యాలు ఎర్రచందనం కలుపుకొని స్నానం చేయడం వల్ల కేతు దోషం తొలగిపోతుంది. ఇలా ఏ దేశంతో అయితే మనం బాధ పడతాను అలాంటి వారు నీటిలో ఆయా వస్తువులను కలుపుకొని స్నానం చేయడంతో గ్రహదోష ప్రభావం తొలగిపోతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World