Indra Yogam : జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న 27 యోగాల్లో ఇంద్ర యోగం శుభ యోగం. ఒక వ్యక్తి జాతకంలో ఇంద్ర యోగం ఏర్పడడం చాలా శుభప్రదంగా భఆవిస్తారు. దీని వల్ల ఆఘిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అంతే కాకుండా ఆ వ్యక్తి కెరియర్ లో పురోగతి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడి నుంచి మూడవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మరియు శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇంద్రయోగం ఏర్పడుతుంది. మరో వైపు, శని నుండి ఏడవ ఇంట్లో శుక్రుడు, వీనస్ నుండి ఏడవ ఇంట్లో బృహస్పతి ఉండాలి.
తులారాశి వ్యక్తికి ఇంద్రయోగం అనేక ప్రయోజనాలను ఇస్తుంది. ఈ వ్యక్తికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతే కాకుండా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతను ఎల్లప్పుడూ ధర్మ మార్లంగోనే నడుస్తాడు. ధనలాభం ఉంటుంది. జాతకంలో ఈ యోగం ఉన్నవాడు చాలా తెలివైనవాడు. ఎవరి జాతకంలో ఇంద్రయోగం ఏర్పడుతుందో… ఆ వ్యక్తి చాలా తెలివైన వాడు అవుతాడు. నాయకుడు అయ్యే అవకాశం ఉంది. ఇతడికి ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. వీరు అపారమైన సంపదను పొందుతారు. ఈ యోగం ఉన్న వ్యక్తికి సమాజంలో గౌరవం మరియు కీర్తి లభిస్తాయి.