...

NTR -Ram Charan: నువ్వు విషం ఇచ్చిన సంతోషంగా తాగుతాను…ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

NTR -Ram Charan: తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్ లు,టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇక చెర్రీ తారక్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక చిట్ చాట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో మాట్లాడిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజమౌళి నుంచి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికి తెలిసిందే. రాజమౌళి సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడే ప్రమోషన్స్ విషయంలో కూడా ఒక క్లారిటీ తో ఉంటారు అన్న విషయం తెలిసిందే. సినిమాతో పాటు ప్రమోషన్లు, ఇంటర్వ్యూలో కూడా డిఫరెంట్ గా ఉండాలి అని రాజమౌళి ఆలోచిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే రాజమౌళి ఇద్దరు హీరోలతో కలిసి చేసిన ఇంటర్వ్యూ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్వ్యూ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ అలిసిపోయి సోఫా దగ్గర అలా కూర్చోవడంతో చరణ్ మీ ఇద్దరికీ తాగడానికి నేను ఏదైనా తీసుకు వస్తాను అంటూ కిచెన్ దగ్గరికి వెళ్లి పోయాడు. నువ్వు ఏం తాగుతావు అంటూ చరణ్ అడగడంతో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నీ చేతితో విషం ఇచ్చిన తాగుతాను అంటూ ఊహించని విధంగా చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో ఆ మాట విన్న ఇద్దరు అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆ మాటకు చరణ్ రాజమౌళి ఇద్దరు కూడా సరదాగా నవ్వుకున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ స్నేహం గురించి అభిమానులు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.