Karthika Deepam April 6 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జ్వాలా తన ఆటోలో ఒక ఆవిడను సౌందర్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళుతుంది. ఆమె ఆటోలో తన బ్యాగు మర్చిపోవడం తో ద్వారా తిరిగి ఇవ్వడానికి సౌందర్య ఇంట్లో కి వెళ్ళి ఆమెకు బాగా ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ తరువాత సౌర్య ని చూసిన సౌందర్య,ఆనందరావు లు చాలా మంచి అమ్మాయిలా ఉంది, కుటుంబం కోసం కష్టజీవిల ఆటో నడుపుతోంది అని జ్వాలాని పొగుడుతారు.
ఆ తరువాత సౌందర్య ఆనందరావు లు స్వప్న మాట్లాడిన మాటలకు సినిమా బాధపడుతోంది ఇంత ఓదార్చిన కూడా ఏడుపు ఆపటం లేదు అన్నీ బాధపడుతూ ఉంటారు. కానీ స్వప్న ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంది సౌందర్య. ఇక మరొకవైపు హిమ తో ప్రేమలో పడ్డ ప్రేమ్ఎంత అందంగా ఉన్నావు హిమ, నన్ను తెలుగు ఆడపిల్ల ఎవరు అని అడిగితే నేను కచ్చితంగా నీ పేరు చెబుతాను.

Karthika Deepam April 6 Today Episode
నీలో ఉన్న అమాయకత్వం, తెలివితేటలు, ఓర్పు ఇవన్నీ కూడా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి అని హిమ ఫోటోని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ప్రేమ్. మరొక వైపు జ్వాలా తన ఆటోను క్లీన్ చేసుకుంటూ రోడ్డుపై వెళ్తున్న కూడా వారందని డాక్టర్ సాబ్ అని పలకరిస్తూ ఉంటుంది.
కానీ ఆ తర్వాత ఇదంతా నా భ్రమ అని అనుకుంటుంది జ్వాల. అయినా కూడా నేను డాక్టర్ సాబ్ గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను అంటూ ఆనంద పడుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు తెచ్చుకొని హిమ నువ్వు కనిపిస్తే నేను వదిలేది లేదు అని అంటుంది సౌర్య. మరొకవైపు హిమ, నిరూపమ్ బస్తీలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తారు.
ఇక కారులో వెళుతూ సౌర్య గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. సౌర్య ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అని బాధపడుతూ ఉంటారు. ఆ తరువాత జ్వాలా చీర కట్టుకొని పద్ధతిగా బస్తిలో మెడికల్ క్యాంపు దగ్గరికి రావడంతో, జ్వాలా ని చీరలో చూసినా ప్రేమ్,నిరూపమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తరువాత వాళ్ళ చేతి పై ఉన్న పచ్చబొట్టు ని చూసి నిరూపమ్, ప్రేమ్ ఎవరి పేరు అని అడగడంతో నా శత్రువు అని చెబుతుంది సౌర్య. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam: జ్వాలాని చూసి ఫిదా అయిన ప్రేమ్, నిరూపమ్.. బాధలో హిమ..?