Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ అన్నం తినకుండా వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జెస్సీ తల్లిదండ్రులు రావడంతో రామచంద్ర జానకి సమయానికి వచ్చారు భోజనం చేయమని పిలవగా వాళ్ళు మాత్రం పెళ్లి తర్వాత నాన్ వెజ్ చేయడం మా ఆచారం అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాము అని అంటారు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
కానీ మల్లిక మాత్రం నాన్ వెజ్ అనగానే రొట్టెలు వేసుకొని తినాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి ఇప్పుడు వద్దులేండి అని అనగా వాళ్లు ఆ నాన్ వెజ్ ని అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. వాళ్లకేదో తెలియక తెచ్చారు నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా చూడండి ఇవి బయట పారేయండి అని జ్ఞానాంబ అనటంతో వెంటనే మల్లిక బయట పారేస్తే వాళ్ళని అవమానం చేసినట్టు అవుతుంది కదా అత్తయ్య అనగా కోపంతో చూడడంతో మల్లికా సైలెంట్ గా ఉంటుంది.
అవి నేనే బయట పారేస్తాను అని మల్లిక తీసుకొని బయటికి వెళ్లి లొట్టలు వేసుకొని మరి తింటూ ఉంటుంది. అప్పుడు విష్ణు అక్కడికి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయగా మల్లిక మౌనంగా ఉండమని చెబుతుంది. జానకి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి రామచంద్ర వచ్చి ఏమి ఆలోచిస్తున్నారు జానకి గారు అని అనగా జెస్సీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు అత్తయ్య గారు గొడవ చేస్తారు అని నేను భయపడ్డాను అని అంటుంది.
అప్పుడు రామచంద్ర అవును జానకి గారు అంటూ వారిద్దరు కొద్దిసేపు జ్ఞానాంబ గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య గారిని జెస్సిని ఇద్దరిని కలిపి ప్రయత్నం చేద్దాం అని అంటుంది జానకి. అప్పుడు రామచంద్ర అది జరిగే పనేనా అని అనగా ట్రై చేద్దాం అని అంటుంది జానకి. ఆ తర్వాత మల్లిక, చికిత ఇద్దరూ కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు.
పక్కనే వెన్నెల మొబైల్ లో గేమ్ ఆడుతూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి వెన్నెలను చదువుకోమని తిడుతుంది. అప్పుడు గోవిందరాజులు అవునమ్మా వెన్నెల చదువుకోవాలి లేదంటే మీ వదిన మల్లికా లాగా తినడానికి తప్ప దేనికి పనికిరావు అంటూ వెటకారంగా మాట్లాడతాడు. ఇంతలోని జానకి దంపతులు అక్కడికి వచ్చి రేపు ఉండ్రాళ్ళ పండగ చేద్దాం అత్తయ్య అనడంతో మొదట వద్దు అనగా ఆ తర్వాత జానకి తన మాటలతో జ్ఞానాంబను ఒప్పిస్తుంది.
ఆ తర్వాత జానకి ఉండ్రాళ్ళ పండుగ కోసం గోరింటాకు రుబ్బుతుండగా ఇంతలో అక్కడికే జెస్సి వచ్చి ఎందుకు నూరుతున్నావు అనటంతో జానకి అసలు విషయం చెబుతుంది. ఆ తర్వాత జెస్సి నేను కూడా మీతో కలిసి పూజ చేస్తాను అక్క అని అంటుంది. వారిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు అన్ని జ్ఞానాంబ వింటూ ఉంటుంది.