Geneliya: రీ ఎంట్రీ సినిమా కోసం అన్ని కోట్ల పారితోషికం డిమాండ్ చేసిన జెనీలియా?

Geneliya: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగిన జెనీలియా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ నటుడు, నిర్మాత రితేష్ దేశ్ ముఖ్ అనే హీరోను పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలో స్థిర పడిన సంగతి మనకు తెలిసిందే.ఇలా వివాహం తర్వాత ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన జెనీలియా తన బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ప్రస్తుతం వారి పిల్లలు పెద్ద కావడంతో జెనీలియా తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈక్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రంలో మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సినిమాలో హీరోయిన్ పాత్రలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలాలీ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకోలేక మరొక ప్రధాన కీలక పాత్రలో నటించే అవకాశాన్ని జెనీలియా దక్కించుకున్నారు.

Advertisement

ఇందులో జెనీలియా కీలక పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ పాత్రలో నటించడం కోసం జెనీలియా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమాలలో 70 లక్షలు తీసుకుంటున్న జెనీలియా ప్రస్తుతం మూడు కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ పాత్ర ఎంతో కీలకంగా ఉండడంచేత ఈమె అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది.

Advertisement